Meena : భ‌ర్త గురించి మీనా ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. పాపం.. ఆమె ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు..

July 7, 2022 7:34 AM

Meena : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అప్ప‌ట్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌. అగ్ర హీరోలు అంద‌రితోనూ సినిమాలు చేసింది. అయితే వివాహం కార‌ణంగా ఈమె కొంత కాలం పాటు సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది. కానీ వివాహం అయ్యాక పాప జ‌న్మించిన అనంత‌రం మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే రెండో ఇన్నింగ్స్‌లో ఈమె త‌మిళం, మ‌ళ‌యాళం భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మీనా జోరు త‌గ్గ‌లేదు. ఈమె న‌టించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. ఈమె విద్యాసాగ‌ర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వివాహం చేసుకోగా.. నైనిక అనే కుమార్తె జ‌న్మించింది.

అయితే మీనా భ‌ర్త కొన్ని రోజుల క్రితం క‌న్నుమూశారు. క‌రోనా కార‌ణంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ అధికం కావ‌డంతో ఆయ‌న‌కు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వ‌చ్చింది. కానీ దాత‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు మార్పిడి వీలు కాలేదు. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఇటీవ‌లే క‌న్నుమూశారు. దీంతో మీనా కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ సంద‌ర్భంగా మీనా సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేసింది. త‌న భ‌ర్త‌ను కోల్పోయిన దుఃఖంలో ఉన్నాన‌ని.. ఈ స‌మ‌యంలో త‌మ‌కు ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని.. ద‌య‌చేసి త‌మ గురించి ఎవ‌రూ త‌ప్పుడు పోస్టులు పెట్టొద్ద‌ని, త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయొద్ద‌ని కోరింది.

Meena emotional post about her husband post viral
Meena

అయితే మీనా త‌మ పెళ్లి రోజు సంద‌ర్భంగా గ‌తంలో త‌న భ‌ర్త గురించి పెట్టిన పోస్ట్ ఒక‌టి తాజాగా వైర‌ల్ అవుతోంది. అందులో మీనా పెట్టిన వాక్యాల‌ను చూస్తుంటే ఆమె త‌న భ‌ర్త‌ను ఎంత‌గా ప్రేమిస్తుందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇక మీనా పెట్టిన పోస్టులో ఏముందంటే.. నా జీవితంలోకి ఇంద్ర‌ధ‌నుస్సులా వ‌చ్చావు, నా జీవితాన్ని రంగుల వ‌ల‌యంగా మార్చావు, నీతో గ‌డిపే ప్ర‌తి క్ష‌ణాన్ని మ‌ధురంగా మిగిల్చావు, ఎల్ల‌ప్పుడూ నువ్వు ఇచ్చిన న‌వ్వు నా వెంటే ఉంటుంది, నా భ‌ర్త‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు.. అంటూ మీనా ఆ పోస్టులో చెప్పింది.

మీనా పెట్టిన పోస్టు పాత‌దే అయినా అదిప్పుడు వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె వాడిన వాక్యాల‌ను చూస్తుంటే ఆమె త‌న భ‌ర్త‌ను ఎంత‌గా ప్రేమిస్తుందో అర్థ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చ‌నిపోయాక మీనా గుండెలు ప‌గిలేలా రోదించింది. వాస్త‌వానికి ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌దు. ఇక భ‌ర్త చ‌నిపోవ‌డంతో మీనా సినిమాల‌కు గుడ్‌బై చెబుతుంద‌ని అనుకున్నారు. కానీ దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment