Actress Pragathi : న‌టి ప్ర‌గ‌తిపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు.. ఈ వ‌య‌స్సులో ఇలాంటి ప‌నులేంటి.. అని కామెంట్స్‌..!

April 22, 2022 10:24 PM

Actress Pragathi : క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్న న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అనేక సినిమాల్లో భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి అంద‌రినీ మెప్పించింది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈమె తాజాగా చేసిన ప‌ని ఒక‌టి నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌లేదు. దీంతో నెటిజ‌న్లు ఆమెను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ వ‌య‌స్సులో ఇలాంటి ప‌నులేంటి.. అని ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జరిగిందంటే..

Actress Pragathi trolled by netizen for her birth day celebrations
Actress Pragathi

న‌టి ప్ర‌గ‌తి త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఇటీవ‌ల చాలా గ్రాండ్‌గా జ‌రుపుకుంది. త‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధువులు, స్నేహితుల స‌మ‌క్షంలో ఆమె జ‌న్మ‌దినం జ‌రుపుకుంది. అయితే జ‌న్మ‌దినాల‌ను జరుపుకుంటే ఏమీ అన‌రు. కానీ ఆ పేరు చెప్పి అస‌భ్య‌క‌ర‌మైన పనులు మాత్రం చేయ‌వ‌ద్దు. స‌రిగ్గా ప్ర‌గ‌తిని ఇందుకనే నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. బ‌ర్త్ డే జ‌రుపుకుంటే జ‌రుపుకున్నావ్‌.. కానీ ఇలాంటి దుస్తుల‌ను ధ‌రించ‌డం ఎందుకు.. అస‌లు ఈ వ‌య‌స్సులో ఇలాంటి ప‌నులేంటి.. మీకు అవ‌స‌ర‌మా.. బ‌ర్త్ డేల‌ను చిన్నారుల‌కు నిర్వ‌హిస్తారు. అలా వారి సంద‌డి తీరుస్తారు. అంతేకానీ ఈ వ‌య‌స్సులో మీకు బ‌ర్త్ డేలు అవ‌స‌ర‌మా.. అని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇందుకు ప్ర‌గ‌తి అయితే స్పందించ‌లేదు. కానీ త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌కు ఆమె స‌మాధానం చెబుతుందనే అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఆ పార్టీలో ప్ర‌గ‌తి అందాల‌ను ఆర‌బోసేలా డ్రెస్‌ను ధరించింది. ఆమె జిమ్ చేస్తున్న స‌మ‌యంలో.. పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తున్న స‌మ‌యంలోనూ ఇలాంటి దుస్తుల‌నే ధ‌రిస్తుంది. అందుక‌నే ఈమె ఎక్కువ‌గా ట్రోలింగ్‌కు గుర‌వుతుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment