---Advertisement---

Anchors : తెలుగు యాంక‌ర్ల రెమ్యున‌రేష‌న్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

April 20, 2022 5:27 PM
---Advertisement---

Anchors : ఒక‌ప్పుడు యాంక‌ర్స్‌కి ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్స్‌తో పోటీ ప‌డుతున్నారు. స్టార్ హీరోయిన్స్‌కి ఉన్నంత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నారు. ముఖ్యంగా అందాల ఆర‌బోత‌తో యాంక‌ర‌మ్మ‌లు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌డం లేదు. యాంక‌ర్లు, టీవీ నటీమణులు బాగానే రెండు చేతులా సంపాదిస్తున్నారు. క్రేజ్ ఉన్న యాంకర్స్‌కు లక్షల్లో పారితోషకం ముట్టజెప్పుతున్నారు. టీవీలో జరిగే షోస్ కి, ఆడియో రిలీజ్ ల‌కి, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినిమా ఇంటర్వ్యూలు.. ఇలా దేనికైనా యాంకర్స్ కావాల్సిందే. వాళ్ళు లేకుండా ఏ టెలివిజన్ షో కూడా నడవదు.

you will be surprised to know about these Anchors remuneration
Anchors

సినిమాకి హీరో ఎంత అవసరమో టీవీ షోలకు యాంకర్స్ అంత అవసరం అన్నమాట. అందుకే వారికి భారీగానే రెమ్యున‌రేష‌న్స్ ఇస్తున్నారు. టాలీవుడ్ యాంక‌ర్స్ ఎవ‌రెవ‌రు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

1. తెలుగులో టాప్ యంక‌ర్ గా కొన‌సాగుతున్న సుమ క‌న‌కాల ఒక ఎపిసోడ్‌కు రూ.2.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటోంది. ఈవెంట్ లేదా ఇంట‌ర్వ్యూ లేదా ప్ర‌త్యేక షో అయితే వేరేగా ఉంటుంది.

2. యాంక‌ర్ మంజూష ప్ర‌స్తుతం రూ.30వేల రెమ్యునరేష‌న్ తీసుకుంటోంది. ఇంట‌ర్య్వూల‌తోనే ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా సంపాదిస్తోంది.

3. యాంక‌ర్ ర‌వి ప్ర‌స్తుతం ల‌క్ష రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడు. మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తున్నాడు. బిగ్ బాస్ షోతోనూ బాగా సంపాందించాడు.

4. యాంక‌ర్ వ‌ర్షిణి రూ.30వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. జ‌బ‌ర్ద‌స్త్, ఢీ, ప‌టాస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

5. యాంక‌ర్ శ్యామ‌ల ప్ర‌స్తుతం రూ.50వేల రెమ్యునరేష‌న్ తీసుకుంటోంది. మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తోంది.

6. యాంక‌ర్ ప్ర‌దీప్ మేల్ యాంక‌ర్స్ లో టాప్ స్థానంలో ఉంటాడు. ప్ర‌దీప్ ల‌క్ష రూపాయ‌ల రెమ్యునరేష‌న్ తీసుకుంటున్నాడు.

7. అప్పుడ‌ప్పుడూ క‌నిపించే శిల్పా చ‌క్ర‌వ‌ర్తి రూ.25వేల నుండి రూ.50 వేల వ‌రకు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

8. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ ర‌ష్మి రూ.1.50 ల‌క్ష‌ల‌ నుండి రూ.1.75 ల‌క్ష‌ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటోంది. అడ‌పాద‌డపా సినిమాల‌తోనూ అల‌రిస్తోంది.

9. మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ రూ.2 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. ప్ర‌స్తుతం అన‌సూయ సినిమాల్లో బిజీగా ఉంది. చివ‌రిగా పుష్ప సినిమాతో ప‌ల‌క‌రించింది. ఈ అమ్మ‌డి ఖాతాలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉన్నాయి.

నోట్‌: ఈ స‌మాచారం ఇంట‌ర్నెట్‌లో మాకు దొరికిన వివ‌రాల‌ను బ‌ట్టి ఇచ్చింది. ఇందులో మార్పులు ఉండ‌వ‌చ్చు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now