OTT : ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్న బీస్ట్‌.. కేజీఎఫ్ 2 సినిమాలు.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

April 20, 2022 11:52 AM

OTT : ఇటీవ‌ల విడుద‌లైన రెండు పెద్ద చిత్రాలు బీస్ట్‌, కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ 2 చిత్రం మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకోగా, బీస్ట్ మాత్రం నిరాశ‌ప‌ర‌చింది. ఏప్రిల్ 13న విడుదలైన బీస్ట్ సినిమా విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది. పైగా బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ 2 పోటీ ఉండటంతో అసలు కోలుకోలేకపోతుంది బీస్ట్. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ని స‌న్ నెక్స్ట్‌, నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకున్నాయి. మే 11, 2022న ఈ చిత్రం ఓటీటీలో రానుంది.

Beast and KGF 2 movies will be releasing on OTT apps
OTT

ఇక కేజీఎఫ్ 2 విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ హీరోగా రూపొందింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు కొల్లగొడుతున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రానుంది. అంటే సినిమా హిట్ అయింది కాబ‌ట్టి మే క‌న్నా ముందు అయితే త‌ప్ప‌ని స‌రిగా రాదు. జూన్ లేదా జూలై మొదటి వారంలో విడుదల అవుతుంద‌ని అంటున్నారు. మ‌రో వైపు సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత అంటే మే 27న అమెజాన్ ప్రైమ్‌లో అన్ని భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ చేయనున్నట్టు దాదాపు ఖరారైంది. త్వరలో ఓటీటీ విడుదలకు సంబంధించిన డేట్‌ను ప్రకటించనున్నారు .

సౌత్‌ నుంచి నార్త్‌ దాకా మొత్తం కలెక్షన్స్ తో దుమ్ము రేపుకుంటూ పోతున్నాడు రాకీ భాయ్‌. ప్రశాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ 2 చిత్రం ఏప్రిల్‌ 14న రిలీజ్ కాగా, ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ చిత్రం. కొత్త రికార్డ్ ల‌ను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు కొన్ని అంశాలు కలిసి వచ్చాయంటున్నారు. ఏదేమైనా ఇంకొన్ని రోజుల పాటు కేజీఎఫ్ 2 హ‌వా కొన‌సాగ‌డం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment