David Warner : కేజీఎఫ్ 2 డైలాగ్‌తో ఆశ్చ‌ర్య ప‌రిచిన డేవిడ్ వార్న‌ర్‌.. వీడియో వైర‌ల్‌..!

April 16, 2022 3:27 PM

David Warner : ఐపీఎల్‌లో చాలా సీజ‌న్ల‌కు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ స‌న్ రైజర్స్ హైద‌రాబాద్‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఈ క్ర‌మంలోనే తెలుగు వారు అత‌నితో చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. ప‌లు తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ.. పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ.. వార్న‌ర్ అల‌రించేవాడు. అలా వార్న‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే వార్న‌ర్‌ను గ‌త ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాద్ రిటెయిన్ చేసుకోలేదు. దీంతో వార్న‌ర్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌కు ఆడ‌డం లేదు. ఢిల్లీ అత‌న్ని కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టుకు వార్న‌ర్ ఈ సీజ‌న్‌లో ఆడుతున్నాడు.

David Warner told KGF 2 movie dialogue video viral
David Warner

అయితే వార్న‌ర్ ఇంకో జ‌ట్టు మారినా.. భార‌తీయ సినిమాల‌కు డ‌బ్ స్మాష్ చేయ‌డం మాత్రం మాన‌లేదు. తాజాగా అత‌ను కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 లోని య‌ష్ డైలాగ్‌.. వ‌య‌లెన్స్‌.. ను డ‌బ్ స్మాష్ చేశాడు. అనంత‌రం ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. డేవిడ్ వార్న‌ర్‌కు ఇండియ‌న్ మూవీలు అంటే ఎంతో ఇష్టం. అందులో భాగంగానే ఆ మూవీల‌కు చెందిన పాట‌లు లేదా డైలాగ్‌ల‌కు డ‌బ్ స్మాష్ చేస్తుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ప్ర‌స్తుతం 8వ స్థానంలో ఉండ‌గా.. స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు 7వ స్థానంలో ఉంది. గ‌త 3 మ్యాచ్‌ల‌లోనూ హైద‌రాబాద్ జట్టు వరుస‌గా గెలుపొంది మంచి జోరు మీద ఉంది. ఇక ఈ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం కొత్త జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతుండ‌గా.. 5 సార్లు టైటిల్‌ను గెలిచిన ముంబై మాత్రం పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో చివ‌రి స్థానంలో కొన‌సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment