KGF 2 : కేజీఎఫ్ 2 ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్‌.. ఎందులో అంటే..?

April 14, 2022 4:48 PM

KGF 2 : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కేజీఎఫ్‌కు సీక్వెల్ గా వ‌చ్చిన చిత్రం.. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2. ఈ మూవీ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా 10వేల‌కు పైగా థియేటర్ల‌లో భారీ ఎత్తున రిలీజ్ అయి సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వ‌స్తుండ‌డంతో సినిమా ఘ‌న విజ‌యం సాధించింద‌ని అంటున్నారు. ఇక ఇందులో యష్ మాస్ యాక్ష‌న్‌కు కేవ‌లం క‌న్న‌డ ప్రేక్ష‌కులు మాత్ర‌మే కాదు.. యావ‌త్ సినీ ప్రేక్ష‌కులు అంద‌రూ ముగ్ధుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రికార్డుల వేటను కొన‌సాగిస్తోంది.

KGF 2 movie OTT partner fixed know which one
KGF 2

ఇక కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌కు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఆ మూవీకి ల‌భించిన ఆద‌ర‌ణ‌ను దృష్టిలో ఉంచుకుని కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 డిజిట‌ల్ హ‌క్కుల‌ను కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థే కొనుగోలు చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్‌పైనే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక ఈ మూవీ విడుద‌ల‌య్యాక నెల రోజుల‌కు అంటే.. మే 14వ తేదీ త‌రువాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

గ‌తంలో జీ5 సంస్థ ఈ మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌లు అబ‌ద్ద‌మ‌ని తేలింది. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ‌నే సొంతం చేసుకుంది. క‌నుక మూవీ అందులోనే స్ట్రీమ్ కానుంద‌ని అఫిషియ‌ల్ గా వెల్ల‌డించారు. ఇక ఇందులో మూవీ స్ట్రీమ్ అయ్యే తేదీని కూడా త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment