Actress Pragathi : జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ.. శ్ర‌మిస్తున్న న‌టి ప్రగతి.. వీడియో..!

April 14, 2022 11:43 AM

Actress Pragathi : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో అందులో హీరోయిన్లు చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వారు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తున్నారు. అవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక వీళ్ల‌ను చూసి బుల్లితెర న‌టులు, సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా న‌టించేవారు కూడా సామాజిక మాధ్య‌మాల్లో సందడి చేయ‌డం మొద‌లు పెట్టారు. వారిలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు ప్ర‌గ‌తి ఒకరు. ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోల‌ను త‌న ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో అవి నెటిజ‌న్ల‌ను అల‌రిస్తుంటాయి.

Actress Pragathi workout video viral
Actress Pragathi

ఇక తాజాగా ప్ర‌గ‌తి జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న‌ప్పుడు తీసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. అందులో ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండ‌డం విశేషం. ఈ మ‌ధ్యే హోలీ పండుగ సంద‌ర్భంగా కూడా ప్ర‌గతి త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో హోలీ ఆడి ఆ వీడియోల‌ను షేర్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

కాగా ప్ర‌గతి ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగానే ఉంది. ఇప్ప‌టికే 100కు పైగా సినిమాల్లో న‌టించిన ఈమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫిట్ నెస్ విష‌యంలోనూ ఈమె చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈమెకు 44 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ అలా ఈమె క‌నిపించ‌దు. అందుకు ఈమె జిమ్ లో చేసే వ‌ర్క‌వుట్లే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment