Anasuya : వార్నింగ్ ఇస్తున్న అన‌సూయ‌.. ఎవ‌రికి..?

March 31, 2022 3:03 PM

Anasuya : ఓ వైపు బుల్లితెర‌పై ప‌లు టీవీ షోలు, ఈవెంట్లు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై కూడా అన‌సూయ చాలా బిజీగా మారింది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె అనేక సినిమాల్లో వ‌రుస‌గా న‌టిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమాలో ఈమె దాక్షాయ‌ణిగా ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. అలాగే ర‌వితేజ ఖిలాడి సినిమాలోనూ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపించి అన‌సూయ అల‌రించింది. అయితే తాజాగా ఇంకో పాత్ర ద్వారా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు ఈమె సిద్ధ‌మ‌వుతోంది.

Anasuya giving warning to whom
Anasuya

అన‌సూయ ప్ర‌ధాన పాత్రలో తెర‌కెక్కిన చిత్రం.. ద‌ర్జా. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. దీన్ని స‌లీమ్ మాలిక్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అన‌సూయ క‌న‌క మ‌హాలక్ష్మి పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా ఈ మూవీకి చెందిన టీజర్‌ను ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేశారు. ఒక నిమిషం 11 సెక‌న్ల నిడివిగ‌ల ఈ టీజ‌ర్‌లో అన‌సూయ చాలా ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు తెలిపాయి.

ఇక ఈ టీజ‌ర్‌లో అన‌సూయ ప‌లు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్ప‌డం చూడ‌వ‌చ్చు. ఎవరైనా ఈ కనకాన్ని టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది.. అనే స్ట్రాంగ్ డైలాగ్‌ను అన‌సూయ చెప్పింది. అలాగే.. నేను చీరకట్టిన శివాంగిని రా.. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి.. అని కూడా ఆమె డైలాగ్ చెప్పింది. దీంతో ఈ టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సునీల్ మ‌రో కీలకపాత్రలో న‌టించాడు. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో శివశంకర్‌ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment