Deepthi Sunaina : అదిరిపోయే స్టెప్పులు వేసిన దీప్తి సునైనా.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!

March 6, 2022 6:54 PM

Deepthi Sunaina : వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ తర్వాత ఈమె మరింత పాపులర్ అయింది. షణ్ముఖ్ జస్వంత్ తో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఏ మాత్రం ఆ విషయం గురించి బాధ పడకుండా తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుందని చెప్పవచ్చు.

Deepthi Sunaina latest dance video viral
Deepthi Sunaina

ఓ వైపు పార్టీలు చేసుకుంటూనే మరో వైపు తన స్నేహితులతో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్‌ చేయగా.. అది వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా మరొక డాన్స్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డాన్ చిత్రం నుండి జ‌లుబుల‌జంగు అనే త‌మిళ పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్రకారును ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన వారు మైమరిచిపోతున్నారు. ఇలా వరుస డాన్స్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటున్న దీప్తి సునయన తాజాగా షేర్ చేసిన ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే దీప్తి సునైనా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ రోజు రోజుకూ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment