Pushpa Movie OTT : పుష్ప మూవీ ఓటీటీలో.. ఎందులో ప్ర‌సారం కానుందో తెలుసా..?

December 19, 2021 11:43 AM

Pushpa Movie OTT : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప‌.. హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఈ మూవీపై మొద‌టి నుంచీ అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అల్లు అర్జున్ పూర్తి మాస్ క్యారెక్ట‌ర్‌లో ఈ మూవీలో క‌నిపించ‌డంతో అభిమానులు తెగ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించి ముందుకు దూసుకెళ్తోంది.

Pushpa Movie OTT know when will be the movie streamed in which ott

అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మూవీలు రిలీజ్ అయ్యాక 35 రోజుల‌కు ఓటీటీల్లో వ‌చ్చేస్తున్నాయి. దీంతో పుష్ప మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా..? అని ప్రేక్ష‌కులు తెగ సందేహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పుష్ప మూవీకి గాను డిజిట‌ల్ రైట్స్‌ను ఇప్ప‌టికే అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ రిలీజ్ అయిన తేదీకి 35 రోజుల త‌రువాత‌.. అంటే.. డిసెంబ‌ర్ 17 నుంచి మొద‌లు పెడితే.. జ‌న‌వ‌రి 21వ తేదీ వ‌రకు ఆ సమ‌యం ముగుస్తుంది. క‌నుక జ‌న‌వ‌రి 21 త‌రువాత పుష్ప మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక ఈ మూవీకి గాను సెకండ్ పార్ట్‌ను కూడా ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో రెండో పార్ట్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం భాష‌ల్లో విడుద‌లైంది. ఇందులో స‌మంత ఓ ప్ర‌త్యేక గీతంలో అలరించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now