Pawan Kalyan : అడ‌విలో బుల్లెట్‌పై ర‌య్యిరయ్యిమని వెళుతున్న ప‌వ‌న్..!

December 18, 2021 3:44 PM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ చిత్రంతో బిజీగా ఉన్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ గా తెర‌కెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నారు.

Pawan Kalyan bike riding video viral

‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్‌’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా వాయిదాపై చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ గా.. రిటైర్డ్ హవల్దార్ గా రానా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్.. రానాకు జంటగా సంయుక్త మీనన్ సందడి చేయనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now