Bigg Boss 5 : బిగ్ బాస్ 5 తెలుగు ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన శ్రీ‌రామ్‌..!

December 4, 2021 7:57 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఫినాలె స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కంటెస్టెంట్ల మ‌ధ్య పోరు మ‌రింత‌గా పెరిగింది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ హౌస్‌లో బిగ్‌బాస్ ఇంటి సభ్యుల‌కు ఇప్ప‌టికే టిక్కెట్ టు ఫినాలె అనే టాస్క్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఇందులో 3 ద‌శ‌లు ముగిసిన త‌రువాత ష‌ణ్ముఖ్, కాజ‌ల్‌, ప్రియాంక‌లు మ‌ధ్య‌లో వెళ్లిపోయారు. మిగిలిన వారిలో సిరి, స‌న్నీ, శ్రీ‌రామ్‌, మాన‌స్‌లు టికెట్ టు పినాలే కోసం పోటీ ప‌డ్డారు.

Bigg Boss 5 sriram gone to finals

శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగింది. ఈ క్ర‌మంలోనే 4వ చాలెంజ్‌లో ఇంటి స‌భ్యుల ఏకాభిప్రాయంతో స‌న్నీ బ్లూ క‌ల‌ర్ జెండాను ఎగుర‌వేశాడు. ఇక టాస్క్ మొద‌ల‌వ్వ‌డానికి ముందు సిరిని ష‌ణ్ముఖ్ ఒడిలో ప‌డుకోబెట్టుకుని టికెట్ టు ఫినాలె నీకే వ‌స్తుంద‌ని చెప్ప‌డం విశేషం.

టికెట్ టు ఫినాలేలో భాగంగా సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లకు బిగ్ బాస్ ఫోక‌స్ టాస్క్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే నలుగురికి నాలుగు పలకలు ఇచ్చి వివిధ రకాల సౌండ్స్ వినిపించారు. ఆ సౌండ్స్‌ని విని అవి వేటికి సంబంధించినవో రాయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే టాస్క్ మొద‌ల‌య్యాక కాజల్, షణ్ముఖ్, ప్రియాంకలు గేమ్ నుంచి తప్పుకున్నారు. అనంత‌రం వారు గేమ్‌లో ఉన్న వాళ్లకి సలహాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ క‌ల‌గ‌జేసుకుని అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఈ టాస్క్‌లో మాన‌స్‌, స‌న్నీలు 7 సీక్వెన్స్‌ల‌ను క‌రెక్ట్ గా రాసి విన్ అయ్యారు. సిరి, శ్రీ‌రామ్‌లు వెనుక‌బ‌డ్డారు. అయితే మొత్తం 4 టాస్క్‌ల స్కోర్‌ని చూస్తే మాత్రం మాన‌స్ 25 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో నిలిచాడు. అనంత‌రం శ్రీ‌రామ్‌కు 21 పాయింట్లు వ‌చ్చాయి. అత‌ను రెండో స్థానంలో ఉన్నాడు. సిరి 19 పాయింట్ల‌తో 3వ స్థానంలో, స‌న్నీ 17 పాయింట్ల‌తో చివ‌రి స్థానంలో నిలిచాడు. ఇక

5వ చాలెంజ్‌లో ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఆక్యురసీ గేమ్ ను ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ చిన్న ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. బోర్డ్‌పై స్విచ్ఛ్‌లు, బల్బ్‌లు ఇచ్చి బజర్ మోగేసరికి 5 చొప్పున బల్బుల‌ను వెలిగించాలని, తక్కువ టైంలో ఎక్కువ బల్బ్‌ల‌ను వెలిగించిన వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారని చెప్పారు. కానీ.. శ్రీరామ్, సిరిలు కాళ్లకి కట్లు కట్టుకుని ఉండటంతో వారి ప్లేస్‌లో మరో ఇద్దరు టాస్క్ ఆడొచ్చని బిగ్ బాస్ చెప్పారు. ఇక‌ సిరి తర‌పున షణ్ముఖ్ రెడీగా ఉంటాడు కాబట్టి.. శ్రీరామ్ తర‌పున ఆడటానికి సన్నీ, మానస్‌లు ముందుకు వచ్చారు. అయితే శ్రీరామ్.. వాళ్లిద్దరితో ఆడించడానికి ఇష్టపడకుండా.. నా తర‌పున, సిరి తరపున షణ్ముఖ్ ఆడతాడని చెప్పాడు.

మొదటిగా సిరి తర‌పున షణ్ముక్ ఆడ‌గా.. సన్నీ తన కోసం తాను ఆడుకుని గెలిచాడు. రెండో రౌండ్‌లో శ్రీరామ్ తర‌పున షణ్ముఖ్ ఆడగా.. మానస్ తన తర‌పున తానే ఆడాడు. మానస్ కంటే షణ్ముఖ్ తక్కువ టైంలోనే బల్బ్‌ల‌ను వెలిగించాడు. ఈ క్ర‌మంలో 5వ చాలెంజ్‌లో శ్రీ‌రామ్ మొద‌టి స్థానంలో నిలిచాడు. 2వ స్థానంలో స‌న్నీ, 3వ స్థానంలో సిరి, చివ‌రి స్థానంలో మాన‌స్ నిలిచారు.

కాగా మొత్తం 5 చాలెంజ్‌లు పూర్త‌య్యే స‌రికి మానస్ 29 పాయింట్లతో మొద‌టి స్థానంలో ఉన్నాడు. 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానంలో, 24 పాయింట్లతో సిరి మూడో స్థానంలో, 23 పాయింట్లతో సన్నీ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ క్ర‌మంలో సన్నీ, సిరి టికెట్ టు ఫినాలే పోటీ నుంచి తప్పుకున్నారు. చివరి ఛాలెంజ్ లో మానస్, శ్రీరామ్ లు పోటీ ప‌డ్డారు. ఇందులో బరువైన బ్యాగ్‌కి తాడు కట్టి.. దాని స‌హాయంతో కింద ఉన్న బ్లేట్స్‌ని విరగ్గొట్టాలి.

కానీ మానస్ బ్యాగ్ కడ్డీలో ఇరుక్కుంటుంది. దీంతో అత‌ను ఓడిపోయాడు. ఈ క్ర‌మంలో శ్రీరామ్ ఈ టాస్క్‌లో గెలిచి టికెట్ టు ఫినాలే అందుకున్నాడు. ఇక‌ బిగ్ బాస్ సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా శ్రీ‌రామ్ నిలిచాడు. తన తర‌పున టాస్క్‌లు ఆడిన సన్నీ, షణ్ముఖ్‌లకు థాంక్స్ చెప్పాడు. కాళ్లకు గాయాలై స‌రిగ్గా న‌డ‌వ‌లేకున్నా శ్రీరామ్ టికెట్ టు ఫినాలే సాధించడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment