Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండపై ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

November 29, 2021 2:29 PM

Vijay Devarakonda : టాలీవుడ్ యువ హీరోల‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్య‌క్తి ఎవ‌రంటే విజ‌య్ దేవ‌ర‌కొండ అనే చెప్పాలి. ఇప్పుడు హీరోగానే కాదు నిర్మాత‌గాను, బిజినెస్‌మెన్ గాను దూసుకుపోతున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల త‌న త‌మ్ముడు హీరోగా పుష్ప‌క విమానం అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. త‌క్కువ సమయంలోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సంచలన విజయాలు అందుకుని మోస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోగా మారాడు విజ‌య్.

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండపై ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు ఆయన డిస్ట్రిబ్యూట్ గా చేశారు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు నిర్మించారు. మంచి అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. నిర్మాతలకు, బయ్యర్లకు కూడా ఈ సినిమా ఎన్నో కోట్ల నష్టం తెచ్చి పెట్టింది.

తాను చేసిన అన్ని సినిమాల్లోనూ అత్యధిక నష్టాలు తీసుకొచ్చింది వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నాడు అభిషేక్. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత విజయ్ దేవరకొండకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడని.. కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు అంటూ సంచలన కామెంట్ చేశాడు. అలాంటి హీరోతో మరోసారి కలిసి పని చేయాలంటే మనసు రాదు అంటున్నాడు అభిషేక్ నామా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment