Samantha : ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్న స‌మంత‌.. షాక్‌లో అభిమానులు..!

November 4, 2021 9:00 PM

Samantha : నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంది. ఆమెపై నెటిజ‌న్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. అన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నా కూడా సోష‌ల్ మీడియాలో నోటికొచ్చిన‌ట్టు కామెంట్స్ చేస్తున్నారు. వారిపై స‌మంత‌.. అమ్మ చెప్పింది అనే హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా పంచ్‌లు వేస్తూనే ఉంది. అయినా విమ‌ర్శ‌ల దాడి మాత్రం ఆగ‌ట్లేదు. దీంతో సామ్ ట్విట్టర్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం.

Samantha shocking decision fans unhappy

కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే ప్రశాంతత దక్కుతుందని స‌మంత ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల అవతలి వాళ్ల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుంది. అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తోంది.

త‌మిళ చిత్ర షూటింగ్ కూడా దాదాపు పూర్తైనట్టు స‌మాచారం. ఇటీవల శ్రీదేవి మూవీస్ సినిమా.. డ్రీమ్ వారియర్ సినిమాకి సంతకాలు చేసింది. నాని కథానాయకుడిగా నటించనున్న దసరా అనే చిత్రానికి సమంతను కథానాయికగా పరిగణిస్తున్నారని కథనాలొచ్చాయి. తాప్సీ పన్ను ప్రొడక్షన్ హౌస్ తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాప్సీ ఔట్ సైడర్స్ ఫిల్మ్స్ బ్యానర్ లో సమంత ప్రధాన పాత్రలో నాయికా ప్రధాన థ్రిల్లర్ ను నిర్మించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment