Bigg Boss 5 : చెంప ప‌గులుద్ది.. అనే మాట‌నే ప్రియ కొంప ముంచిందా ?

October 25, 2021 11:14 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో ఏడోవారం ప్రియ ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుందేమోన‌ని అంద‌రూ భావించారు. కానీ స‌స్పెన్స్ న‌డుమ ప్రియ ఎలిమినేట్ అయింది. గ‌త వారం నామినేషన్స్‌లో ప్రియ, అనీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్‌ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు.

Bigg Boss 5 priya self goal her comments are the main reason for her eviction

కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్ ప్రియ, వీజే సన్నీ మధ్య వాగ్వాదం నడిచింది. కోడి నుండి గుడ్లు సేకరించడం, వాటిని దాచుకోవడం రసాభాసకు దారితీసింది. ఈ గేమ్ లో ప్రియ బుట్టను చించి వేస్తుంటే, సన్నీ అడ్డుకున్నాడు. ఆమెను పక్కకు తోసేసి బుట్ట తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రియ చెంప ప‌గులుద్ది అన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారు.

తనను గట్టిగా తోసేశాడని, అందుకే కోపంతో అలా అన్నాను.. అంటూ ప్రియ వివరణ ఇచ్చింది. అయితే ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. ఆ గొడ‌వలో ప్రియ కాస్త శృతి మించిన‌ట్టు క‌నిపించ‌డంతో ఆమెను ఎలిమినేట్ చేశార‌ని అంటున్నారు. టాస్క్‌ల‌లో ప్రియ‌.. స‌న్నీని టార్గెట్ చేయ‌డం, నువ్వు మ‌గాడివే కాదు అని అన‌డం, ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను.. అంటూ దారుణంగా రెచ్చ‌గొట్టడం ప్రియ‌కు నెగెటివ్‌గా మారాయ‌ని అంటున్నారు. ముందు అనీ మాస్ట‌ర్ డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా, ఆ త‌ర్వాత ప్రియ ప్ర‌వ‌ర్తించిన తీరు ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment