Arha : బ‌న్నీ కూతురు రాబోయే కాలానికి కాబోయే స్టార్.. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రు చేశారో తెలుసా?

October 21, 2021 5:25 PM

Arha : అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అర్హ.. శాకుంత‌లం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్హ యువరాజు భరతుడిగా కనిపించబోతోంది. ఇప్పటికే తనకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. చిత్రీకరణ సందర్భంగా అల్లు అర్జున్ – స్నేహారెడ్డి సెట్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఎందరినో బాలనటులుగా పరిచయం చేసిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ అర్హను కూడా తెరకు పరిచయం చేస్తున్నారు.

Arha is rock star in future says samantha

అర్హ గురించి తాజాగా స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. `అల్లు అర్హ జన్మతః రాక్ స్టార్ గా పుట్టిందని.. తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుందని.. అలాంటి అర్హ తన సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. సెట్స్‌లో 200 నుంచి 300 ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఉన్నా కూడా త‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. త‌ను చ‌క్క‌గా తెలుగు మాట్లాడుతుంది.

అర్హ‌ పుట్టుక‌తోనే సూప‌ర్‌స్టార్‌. నా సినిమాతో తెరంగేట్రం చేయ‌డం మ‌రింత ఆనందాన్నిచ్చింది. ఆమె ఈ సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఏలుతుంది. శాకుంత‌లం సినిమా చూసిన త‌ర్వాత ఆ మాట‌తో అంద‌రూ ఏకీభ‌విస్తారు.. అంటూ స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కాగా.. శాకుంత‌లం సినిమా కోసం అర్హ ప‌ది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన‌గా, అల్లు అర్జున్ ఫాల్కన్ నే దించేశారు. అర్హకు ఎలాంటి కష్టం లేకుండా `ఫాల్కన్ బస్`ని ఏర్పాటు చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment