Regina : డబ్బు కోసం ఇలాంటి పనులు ఏంటి అంటూ.. రెజీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

October 21, 2021 5:57 PM

Regina : సాధారణంగా ఎంతో మంది సెలబ్రెటీలు సినిమాలలో నటిస్తూనే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా నటి రెజీనా కూడా ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

netizen angry over Regina for ad work with alcohol company

ఈ క్రమంలోనే ఆ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకుగాను ఈ విషయాన్ని రెజీనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈమెపై నెటిజన్లు ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈమె అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నది ఒక ఆల్కహాల్ కంపెనీకి చెందినది కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రెజీనా చెప్పుకొస్తూ తాను 9 సంవత్సరాల వయసున్నప్పుడు యాంకర్ గా పరిచయం అయ్యానని ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటూ మందు గ్లాస్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఈమెపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు డబ్బు కోసం ఇలాంటి పనులు చేయడం ఏంటి.. నేను నిన్ను అన్ ఫాలో అవుతున్నాను.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment