Balakrishna Car : అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న బాల‌య్య ల‌గ్జ‌రీ కారు.. ఎవ‌రు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా ?

October 18, 2021 5:08 PM

Balakrishna Car :టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. ఇన్నాళ్లూ వెండితెర‌పై సంద‌డి చేసిన ఆయ‌న ఇప్పుడు బుల్లితెర‌పై ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా పండగ సందర్భంగా ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ ఓ ల‌గ్జ‌రీ కారులో రాగా.. ఇది అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

Balakrishna Car  attracting everybody who given to him as gift

బాల‌య్య కారు కంపెనీ పేరు బెంట్లీ కాగా.. ఈ కారును బాలకృష్ణకు ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారు విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గ‌త కొద్ది రోజులుగా బాల‌కృష్ణ ఈ కారులోనే ప్ర‌యాణిస్తున్నట్టు స‌మాచారం. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.50 లక్షల చొప్పున రూ.6 కోట్ల వరకు బాలయ్య పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాల విషయానికి వ‌స్తే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ ఫిల్మ్ అఖండ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు రెడీ అవుతోంది. దీంతో బాలయ్య తదుపరి సినిమాపై ఫోకస్ చేశారట. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని‌తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలో బాలయ్య మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కథలో మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment