Anushka Shetty : అనుష్క ఏంది అమ్మ పాత్ర‌ల‌పై దృష్టి సారిస్తుందా..!

October 17, 2021 2:46 PM

Anushka Shetty : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన అనుష్క బాహుబలి సినిమా తర్వాత మరే సినిమాల్లోనూ నటించలేదు. లేటెస్ట్ గా అనుష్క్ అమ్మ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ వర్గాలతోపాటుగా సోషల్ మీడయాలోనూ టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా అనుష్క రెండు సినిమాలకు ఓకే చెప్పిందట. అయితే ఈ వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Anushka Shetty to do mother characters in movies

ఎందుకంటే అనుష్క అతి త్వరలో పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన వార్తని అనుష్క అనౌన్స్ చేస్తుందని అంటున్నారు. ఇక మూవీస్ విషయంలో హీరో నాని యాక్ట్ చేయబోయే సినిమాలో అనుష్క తల్లి పాత్రలో నటించే అవకాశం ఉందని.. ఈ క్రమంలో ఓ ప్రొడ్యూసర్ కూడా అనుష్కను కలిసినట్లు చెబుతున్నారు.

ఈ సినిమాలో అనుష్క పాత్రకు ఎంతో వాల్యూ ఉందని అన్నారు. అందుకే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ కు తల్లి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనుష్క కెరీర్ లో తన ఆలోచనని మార్చుకుందని అనుకుంటున్నారు. ఆమెకు హీరోయిన్ గా ఏదైనా పాత్ర వచ్చినా.. అనుష్క మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే యాక్ట్ చేయాలని అనుకుంటుందట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment