Bigg Boss 5 : షణ్ముఖ్ డ్రగ్ లాంటి వాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన దీప్తి..!

October 16, 2021 6:57 PM

Bigg Boss 5 : సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ వెబ్ సిరీస్ లో వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ జంటకు ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి చేసే వీడియోలను వెబ్ సిరీస్ లో చూస్తే వీరి ఇద్దరి మధ్యా ఏదో ఉందనే అనుమానాలు వస్తాయి.

Bigg Boss 5 deepthi sunayana comments on shanmukh

ఇకపోతే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని అభిమానులు భావిస్తున్నప్పటికీ వీరు ఈ విషయం గురించి మాట్లాడకపోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న షణ్ముఖ్‌ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. షణ్ముఖ్‌ పుట్టినరోజు సందర్భంగా తనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పి.. దీప్తి ప్రపోజ్ చేయడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు మీ ఫోన్‌లో షణ్ముఖ్ నంబర్ ను ఏమని సేవ్ చేసుకున్నారు.. అని అడగగా.. అందుకు దీప్తి.. షణ్ముఖ్‌ వాట్స్అప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో షణ్ముఖ్ నంబర్ డ్రగ్ అని ఉంది. తను షణ్ముఖ్‌ కి డ్రగ్ మాదిరిగా బానిస అయ్యానని.. ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment