ఏడాదిలో మనకు 12 నెలలు ఉంటాయి. అలాగే 12 రాశి చక్రాలు ఉంటాయి. వీటి ప్రకారం ఎవరి భవిష్యత్తు అయినా ఆధార పడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, వారి స్వభావం ఎలా ఉంటుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు నెలలో పుట్టిన వారికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వారు ఇతరులను అడగకుండానే స్వతహాగా నిర్ణయాలను తీసుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు.
ఈ నెలలో పుట్టిన వారు ఇతరుల మనస్సును గెలుస్తారు. అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఏదైనా పని అనుకుంటే వెంటనే ప్రారంభిస్తారు. అయితే వీరు తలపెట్టిన పనులను మధ్యలో ఆపరాదు. ఆపితే ఇక అవి జరగవు.
ఆగస్టు నెలలో పుట్టిన వారికి డబ్బు విషయంలో సమస్యలు వస్తాయి. అన్ని విధాలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కలలు కనే స్వభావం ఉంటుంది. కొందరు సోమరిపోతులుగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతరులను ఎదిరించే శక్తి ఉంటుంది. దాంతో ఎవర్నయినా తిప్పి కొడతారు. శత్రువులను సైతం జయిస్తారు.
వీరు మంచి వాతావరణంలో ఉండాలని, మంచి జీవితం గడపాలని కోరుకుంటారు. దైవాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. సంప్రదాయాలపై గౌరవం ఉంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువే. లోక జ్ఞానం మెండు. జ్యోతిషులు అయితే రాణిస్తారు. మతం, పురాణాలపై నమ్మకం, అవగాహన ఉంటాయి. దైవ భక్తి ఎక్కువ. వీరు ప్రేమను ఎక్కువగా నమ్ముతారు. ఇష్టపడే వారిని ప్రేమిస్తారు.
వీరికి కంటి జబ్బులు లేదా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సోమ, బుధ, ఆది వారాల్లో పనులు చేస్తే కలసి వస్తుంది. ఆకుపచ్చ, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచి జరుగుతుంది. ఆ రంగులు కలసి వస్తాయి. పగడం, పసుపు రంగు రాయిలను ధరిస్తే మంచి జరుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…