Paint In Rooms : ప్రపంచంలో మనిషి కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. అయితే వాటిలో చాలా మంది అనేక రకాల రంగులను ఇష్ట పడతారు. కొందరికి ఎరుపు అంటే ఇష్టం ఉండొచ్చు. కొందరు నలుపు అంటే ప్రాణం అవ్వవచ్చు. ఇంకా కొందరికి పసుపు, నీలం, పింక్, తెలుపు.. ఇలా రక రకాల కలర్లు నచ్చుతాయి. ఆ రంగులకు అనుగుణంగానే ఎవరైనా వస్తువులను కొనుక్కుంటారు. దుస్తులను కూడా వేసుకుంటారు. అయితే అవే రంగులను ఇంటి లోపల ఉండే గోడలకు వేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? దాని గురించే ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది. ఇంట్లో ఉన్న గోడలకు ఏ రంగు వేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లైట్ ఎల్లో – ఈ రంగును ఇంటి లోపల గోడలకు వేస్తే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, కొట్లాటలు తగ్గుతాయట. జీవితం ప్రశాంతంగా సాగిపోతుందట. ఈ కలర్‌ను పిల్లల బెడ్ రూంలో వేస్తే ఇంకా మంచిదట. దీంతో వారు చాలా ప్రశాంతమైన జీవితం గడపడమే కాదు, చదువుల్లోనూ రాణిస్తారట. లైట్ బ్లూ – ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ కలర్ గోడలకు వేయించాలట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి కలిగే ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. సమస్యలను పరిష్కరించుకునే శక్తి లభిస్తుందట. ఎల్లప్పుడూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారట.
లైట్ గ్రీన్ – గర్భంతో ఉన్న మహిళలు ఈ కలర్ గోడలు ఉన్న బెడ్‌రూంలో ఉండాలట. దీంతో వారికి పుట్టబోయే బిడ్డ ఎలాంటి అవలక్షణాలు, అనారోగ్యాలు లేకుండా అందంగా పుడతాడట. ఇక పెళ్లయిన వారు త్వరగా సంతానం కావాలనుకుంటే ఈ రంగును గోడలకు వేయించాలట. తెలుపు – ఏ అంశం పట్ల అయినా ఏకాగ్రత ఉండడం లేదా..? అయితే మీ ఇంట్లో గోడలకు ఈ రంగు వేయించండి. దీంతో ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం మీ మెమొరీ పవర్ పెరగడమే కాదు, ఏకాగ్రత బాగా లభిస్తుందట. మానసిక శక్తి పెరుగుతుందట. ఎరుపు – దంపతుల మధ్య కలహాలు ఉంటే ఈ రంగును ఇంట్లో బెడ్‌రూంకు వేయించాలి. దీంతో వారి మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. శృంగార భావాలు కలుగుతాయి. నవ దంపతులు ఇలాంటి రంగు ఉన్న బెడ్ రూంలో పడుకుంటే వారి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రావట. జీవితం హాయిగా సాగుతుందట.
లావెండర్ – జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇంట్లో గోడలకు ఈ రంగు వేయించాలట. మానసిక శక్తి పెరుగుతుందట. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. దీంతో అన్ని సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారట. మట్టి రంగు – నిద్రలేమి సమస్య ఉన్న వారు బెడ్ రూం గోడలకు ఈ రంగు వేయిస్తే ఆ సమస్య పోతుందట. అనారోగ్య సమస్యలు ఉండవట. చక్కగా నిద్ర పడుతుందట. నలుపు – ఇంట్లోని గోడలకే కాదు, అసలు ఇంటి బయట కూడా ఎక్కడా దేనికీ నలుపు రంగు వేయించకూడదట. అలా చేస్తే అన్నీ సమస్యలే వస్తాయట. వాస్తు పరంగా నలుపు రంగు మంచిది కాదట. కనుక ఈ రంగుకు దూరంగా ఉండడం మంచిది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…