House Vastu : ఇప్పటికి కూడా చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు, ఇల్లు కట్టిన తర్వాత కూడా వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇల్లు కట్టేసిన తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి పొరపాట్లని చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే, ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.
ఇంటి ముందు మురికి నీళ్లు వచ్చి చేరేలా ఉండకూడదు. అలానే ఇంటి ముందు ముళ్ళకి సంబంధించిన మొక్కల్ని పెంచకూడదు. ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. ఇంటికి ముందు విరిగిపోయిన సామాన్లు, పాడైపోయిన సామాన్లని పెట్టకూడదు. ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు. కాబట్టి ఇంటిని కట్టుకునేటప్పుడే ఇవేమీ లేకుండా చూసుకోవడం మంచిది.
ఇంటి ముందు ఉండే రోడ్డు ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలోనే ఉండాలి. అంటే మన గుమ్మం ఎత్తుగా ఉండాలి. రోడ్డు మన గుమ్మం కంటే తక్కువ ఉండాలి. ఇంటికి ఎదురుగుండా ఎప్పుడూ చెప్పులని విడిచి పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదు. ఇంటికి ఎదురుగా దేవుడు గుడి కానీ వీధి కానీ రోడ్డు కానీ బోరు కానీ బావి కానీ ఉండకూడదు.
అలా ఉన్నట్లయితే గుమ్మానికి వీధి పోటు వచ్చి ఇంటి సభ్యులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా మెట్లు ఉంటే కష్టాలు వస్తాయి. ఇంటికి ఎదురుగా చీపురు పెట్టకూడదు. ఇంటి చుట్టూ తీగ చెట్లు ఎక్కువగా ఉండకూడదు. ఇలా ఇల్లు కట్టేటప్పుడు ఈ విధంగా పాటించాలి. వాస్తు ప్రకారం జాగ్రత్తగా ఉంటే, అంతా మంచే జరుగుతుంది. శుభం కలుగుతుంది. లేదంటే అనవసరంగా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…