స‌మాచారం

చిరిగిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా ? ఇలా మార్చుకోవ‌చ్చు..!

సాధార‌ణంగా ఎవరూ కూడా చిరిగిన క‌రెన్సీ నోట్ల‌ను ఇస్తే తీసుకోరు. అవి మ‌న చేతుల్లోకి అనుకోకుండా రావ‌ల్సిందే. ఇక కొన్ని అరుదైన సంద‌ర్భాల్లో ఏటీఎంల నుంచి కూడా మ‌న‌కు చిరిగిన నోట్లు వ‌స్తుంటాయి. ఇలా వ‌స్తే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. అలాంటి నోట్ల‌ను సుల‌భంగా మార్చుకోవ‌చ్చు. కేవ‌లం చిరిగిన నోట్లే కాదు, రంగు మారిన‌వి, నోట్ల‌పై ఉండే అక్షరాలు, చిహ్నాలు, బొమ్మ‌లు చెరిగిపోయిన నోట్ల‌ను కూడా మార్చుకోవ‌చ్చు. అందుకు గాను వినియోగ‌దారులు ఏదైనా బ్యాంకును సంద‌ర్శించ‌వ‌చ్చు.

చిరిగిన లేదా దెబ్బ తిన్న‌, రంగు మారిన నోట్ల‌ను మార్చుకునేందుకు ఇంత‌కు ముందు ఆర్‌బీఐ శాఖ‌ల‌ను సంద‌ర్శించాల్సి వ‌చ్చేది. కానీ ఆర్‌బీఐ 2009 నియ‌మాల ప్ర‌కారం ప‌బ్లిక్ లేదా ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు వినియోగ‌దారులు తెచ్చే నోట్ల‌ను మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు అందించే నోట్లు లేదా నాణేల‌ను మార్చి వాటి విలువ‌కు స‌మానం అయ్యే నోట్ల‌ను, నాణేల‌ను ఇవ్వాలి. అలా చేయ‌క‌పోతే వినియోగ‌దారులు ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

ఇక చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు నోట్ల‌ను, నాణేల‌ను మార్చ‌వ‌చ్చు లేదా మార్చ‌క‌పోవ‌చ్చు. ఆ విష‌యంపై నిర్ణ‌యాన్ని ఆర్‌బీఐ వాటికే వ‌దిలేసింది. కానీ బ్యాంకుల్లో మాత్రం వాటిని క‌చ్చితంగా మార్చాల్సి ఉంటుంది. లేదంటే ఆర్‌బీఐ శాఖ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM