స‌మాచారం

ఎస్‌బీఐ, యాక్సిస్, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంకుల క‌స్ట‌మ‌ర్లు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

మీకు ఎస్‌బీఐ, యాక్సిస్, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయా ? అయితే ఈ విష‌యాల‌ను మీరు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. జూలై 1 నుంచి ఆ బ్యాంకుల‌కు చెందిన ప‌లు రూల్స్ ను మార్చారు.

ఎస్‌బీఐ క‌స్ట‌మర్లు త‌మ బ్రాంచ్ లేదా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నెల‌కు కేవ‌లం 4 సార్లు మాత్ర‌మే ఉచితంగా న‌గ‌దును తీసుకోవ‌చ్చు. ఆ త‌రువాత న‌గ‌దు తీస్తే ఒక్కో లావాదేవీకి రూ.15 + జీఎస్టీ క‌లిపి వ‌సూలు చేస్తారు. అలాగే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదిలో 10కి పైగా చెక్కుల‌ను ఉప‌యోగిస్తే ఆ త‌రువాత చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. 10కి పైగా చెక్కుల‌ను వాడిత‌న త‌రువాత మ‌ళ్లీ 10 చెక్కులు కావాలంటే రూ.40 + జీఎస్టీ వ‌సూలు చేస్తారు. అదే 25 చెక్కుల‌కు అయితే రూ.75 + జీఎస్టీ వ‌సూలు చేస్తారు. సీనియ‌ర్ సిటిజెన్ల‌కు ఈ చార్జిలు ఉండ‌వు.

సిండికేట్ బ్యాంకును కెన‌రా బ్యాంకులో విలీనం చేశారు క‌నుక ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు జూలై 1 నుంచి మారాయి. క‌నుక ఆ వివ‌రాల‌ను తెలుసుకుని లావాదేవీలు చేస్తే మంచిది. ఇక ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేష‌న్ బ్యాంకుల‌ను యూనియ‌న్ బ్యాంకులో విలీనం చేశారు క‌నుక ఖాతాదారులు జూలై 1 నుంచి కొత్త చెక్ బుక్‌ల‌ను తీసుకోవాలి.

యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎంల నుంచి తీసుకునే న‌గదు ప‌రిమితిని పెంచారు. ప‌లు ర‌కాల సేవింగ్స్ ఖాతాల‌కు మినిమం బ్యాలెన్స్ రిక్వ‌యిర్‌మెంట్‌ల‌ను పెంచారు. జూలై 1 నుంచి బ్యాంకు ఖాతా దారులు ప్ర‌తి ఎస్ఎంఎస్ అల‌ర్ట్‌కు 25 పైస‌లు నెల‌కు గ‌రిష్టంగా రూ.25 చెల్లించాలి. ఓటీపీ మెసేజ్‌ల‌కు చార్జిలు ఉండ‌వు.

ఐడీబీఐ ఖాతాదారులు ఇక‌పై ఏడాదిలో 20కి పైగా చెక్కుల‌ను వాడితే ఆపై వాడే ప్ర‌తి చెక్కుకు రూ.5 చెల్లించాలి. అయితే ఆ బ్యాంకులో స‌బ్‌కా సేవింగ్ ఖాతా ఉన్న‌వారికి ఈ రూల్ వ‌ర్తించ‌దు. ఈ రూల్స్ అన్నీ జూలై 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM