Aadhar Card: మన రోజువారి కార్యకలాపాల్లో ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఎంతో ఉంది.పుట్టిన పిల్లల నుంచి చనిపోయే వరకు ప్రతి సందర్భంలో ఆధార్ కార్డు అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ క్రమంలోనే చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులను జారీ చేస్తున్నారు. అయితే ఈ ఆధార్ కార్డు విషయంలో కొన్ని పేర్లు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ వంటివి తప్పుగా రావడంతో చాలామంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను ప్రస్తుతం మనం ఇంటిలో ఉండి ఎంత సులభంగా సరిచేసుకోవచ్చు. ఎలాగంటే..
మన ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా యూఐడీఏఐ ఆన్‌లైన్ ద్వారా తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు. అయితే ఈ తప్పులను సరి చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసిన మీ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు.ఈ క్రమంలోనే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ పేరు చిరునామా వంటివి తప్పులు ఉంటే ఎంతో సులభంగా సరిదిద్దుకోవచ్చని ఈ సందర్భంగా యూఐడీఏఐ తెలిపింది.
దీని కోసం మనం యూఐడీఏఐ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆన్‌లైన్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకొని ఇందులో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేయడంతో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే తప్పులు ఉంటాయో అక్కడ సరి చేసుకున్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చెల్లిస్తే మన పని పూర్తయినట్లే. కొద్దిరోజుల తర్వాత మన మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. దీని ద్వారా ఆధార్ సెంటర్ కు వెళ్లి మనం కొత్త ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్‌లో నిలబడే అవసరం లేదు. రిమోట్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్‌లో చాలాకాలంగా హాట్‌టాపిక్‌గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్‌లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్‌లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…