టెక్నాల‌జీ

వొడాఫోన్ ఐడియా నుంచి రూ.267 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌.. 25 జీబీ డేటా ఉచితం.. రోజువారీ లిమిట్ లేదు..!

టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇటీవ‌లే రూ.447కు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఆ ప్లాన్‌లో 50 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. దానికి ఎలాంటి రోజువారీ డేటా లిమిట్ లేదు. 60 రోజుల వాలిడిటీ ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్‌లు ఆ త‌ర‌హా ప్లాన్‌ను లాంచ్ చేయ‌డంతో వొడాఫోన్ ఐడియా కూడా ఆ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇక అదే త‌ర‌హాలో రోజువారీ డేటా లిమిట్ లేకుండా రూ.267కే ఇంకో ప్రీపెయిడ్ ప్లాన్‌ను వొడాఫోన్ ఐడియా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణ‌యించారు.

వొడాఫోన్ ఐడియాకు చెందిన రూ.267 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను వాడుకోవ‌చ్చు. 25 జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. దీనికి రోజువారీ లిమిట్ లేదు. ఎప్పుడైనా, ఎంతైనా వాడుకోవ‌చ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణ‌యించారు. దీంతోపాటు వీఐ మూవీస్ అండ్ టీవీ క్లాసిక్ కు యాక్సెస్ ల‌భిస్తుంది.

ఈ ప్లాన్‌ను వొడాఫోన్ ఐడియాకు చెందిన వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేశారు. అందువ‌ల్ల ఆన్‌లైన్‌లో రీచార్జి చేసుకోవ‌డం ద్వారా ఈ ప్లాన్‌ను వినియోగ‌దారులు ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక జియోలో రూ.247కు ఇదే ప్లాన్ ల‌బిస్తోంది. ఎయిర్‌టెల్‌లో దీన్ని రూ.299కు అందిస్తారు. ఈ రెండు ప్లాన్లలో వ‌రుస‌గా 25, 30 జీబీ డేటా వ‌స్తుంది. రెండింటికీ 30 రోజుల వాలిడిటీ ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ల‌భిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM