టెక్నాల‌జీ

Jio Rs 75 Prepaid Plan : జియోలో చ‌వ‌కైన ప్లాన్ కోసం చూస్తున్నారా..? రూ.75తో రీచార్జి చేస్తే..?

Jio Rs 75 Prepaid Plan : ఈమ‌ధ్య‌నే టెలికాం సంస్థ‌లైన రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాలు మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దాదాపుగా 20 నుంచి 30 శాతం మ‌ధ్య ఈ చార్జిల‌ను పెంచారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోతున్నారు. అయితే త‌మ వినియోగ‌దారుల‌ను కాపాడుకునేందుకు గాను స‌దరు కంపెనీలు త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన ప్లాన్ల‌ను మ‌ళ్ల అందుబాటులోకి తెస్తున్నాయి. అందులో భాగంగానే జియో కూడా ఒక ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ప్లాన్ ప్ర‌త్యేకంగా కేవ‌లం జియో ఫోన్ క‌లిగిన వారికే వ‌ర్తిస్తుంది. ఇక ఈ ప్లాన్ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ఫోన్ ఉన్న‌వారు అత్యంత చ‌వ‌కైన ప్లాన్ కావాల‌నుకుంటే వారు రూ.75తో రీచార్జి చేసుకోవ‌చ్చు. దీంతో ఈ ప్లాన్‌లో 23 రోజుల వాలిడిటీ ల‌భిస్తుంది. అలాగే రోజుకు 100 ఎంబీ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. మొత్తంగా 23 రోజుల వాలిడిటీకి గాను 2.5 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే డేటా అయిపోగానే ఇంట‌ర్నెట్ స్పీడ్ అనేది 64 కేబీపీఎస్‌కు త‌గ్గించ‌బ‌డుతుంది. ఇక ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 50 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. కానీ కాల్స్‌ను అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవ‌చ్చు.

Jio Rs 75 Prepaid Plan

మ‌రో ప్లాన్ కూడా..

డేటా వినియోగం పెద్ద‌గా ఉండ‌దు అనుకునేవారు జియో ఫోన్ ద్వారా రూ.75 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవ‌చ్చు. అయితే ఇందులోనే ఇంకాస్త ఎక్కువ డేటా కావాల‌నుకుంటే అలాంటి వారు రూ.125తో రీచార్జి చేసుకోవ‌చ్చు. దీంట్లో క‌స్ట‌మ‌ర్ల‌కు పైన ప్లాన్ లాగే 23 రోజుల వాలిడిటీ ఉంటుంది. కానీ రోజుకు 500 ఎంబీ డేటా వ‌స్తుంది. మొత్తంగా 11.5 జీబీ డేటాను ఈ వాలిడిటీలోగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి. ఎస్ఎంఎస్‌ల‌ను కూడా ఉచితంగా ఇస్తారు. ఇక ఈ రెండు ప్లాన్ల‌కు కూడా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ వంటి యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

ఈ రెండు ప్లాన్ల‌ను మీరు ఎక్కడైనా రీచార్జి చేసుకోవ‌చ్చు. మై జియో యాప్‌లో లేదా జియో వెబ్ సైట్‌లో ఈ ప్లాన్‌ల‌ను రీచార్జి చేసుకోవ‌చ్చు. లేదా గూగుల్ పే, ఫోన్ పేల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మీ జియో ఫోన్‌లో ఈ ప్లాన్ల‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. డేటా వినియోగం పెద్ద‌గా ఉండ‌దు, కాల్స్ మాత్ర‌మే కావాల‌ని అనుకునేవారు ఈ ప్లాన్ల‌ను జియో ఫోన్ ద్వారా ఉప‌యోగించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ఆ 100 విజయాలు వేస్ట్’.. వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ స్పీచ్‌! సూర్యకుమార్ షాకింగ్ రివీల్.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…

Thursday, 12 March 2026, 10:50 AM

ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…

Wednesday, 11 March 2026, 10:24 PM

విడాకులు తీసుకున్న హన్సిక.. పెళ్లయిన రెండేళ్లకే భర్తతో బంధం కట్! భరణం కూడా వద్దంటూ..

నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…

Wednesday, 11 March 2026, 9:27 PM

ఉద్రిక్తతల మధ్య క్షేమంగా చెన్నైకి అజిత్.. దుబాయ్ నుండి రాక.. వీడియో వైరల్!

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెల‌కొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య త‌మిళ నటుడు…

Wednesday, 11 March 2026, 6:19 PM

వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్‌దీప్‌కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…

Wednesday, 11 March 2026, 2:59 PM

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM