ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సెప్టెంబర్ 14వ తేదీన ఐఫోన్ 13 మోడల్స్ ను లాంచ్ చేయనున్న విషయం విదితమే. అయితే కొత్త ఐఫోన్లను విడుదల చేసే ముందు యాపిల్ సంస్థ పాత ఐఫోన్ల ధరలను తగ్గిస్తుంది. ఇప్పుడు కూడా ఆ సంస్థ అలాగే చేసింది. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు విడుదల కానుండడంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల ధరలను తగ్గించింది. దీంతో తగ్గిన ధరలకే ప్రస్తుతం ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 12 మినీకి చెందిన 64జీబీ, 128 జీబీ మోడల్స్ ధరలు రూ.69,900, రూ.74,900 ఉండగా ఇప్పుడివి రూ.59,999, రూ.64,999 ధరకు లభిస్తున్నాయి. అలాగే 256 జీబీ మోడల్ ధర రూ.84,900 ఉండగా ఇప్పుడిది రూ.74,999 ధరకు లభిస్తోంది.
ఐఫోన్ 12 64జీబీ మోడల్ ధర రూ.79,900 ఉండగా, రూ.66,999 ధరకు లభిస్తోంది. అలాగే 128 జీబీ మోడల్ ధర రూ.84,900 నుంచి రూ.71,999 ధరకు తగ్గింది. 256 జీబీ వేరియెంట్ ధర రూ.94,900 నుంచి రూ.81,999 కు తగ్గింది.
ఐఫోన్ 12 ప్రొ కు చెందిన 128 జీబీ మోడల్ రూ.1,15,900 కు లభిస్తోంది. అలాగే 256 జీబీ మోడల్ ధర రూ.1,25,900గా ఉంది. అదేవిధంగా 512 జీబీ వేరియెంట ధఱ రూ.1,45,900గా ఉంది.
ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 128జీబీ, 256 జీబీ, 512జీబీ స్టోరేజ్ మోడల్స్ ధరలు వరుసగా రూ.1,25,900, రూ.1,35,900, రూ.1,55,900గా ఉన్నాయి.
యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు ఎ14 బయానిక్ చిప్ ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 లలో వెనుక వైపు 2 కెమెరాలు ఉండగా, మరో 12 మెగాపికల్స్ అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్లలో వెనుక వైపు అదనంగా 12 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఉంది. వీటిల్లో 5జి ఫీచర్‌ను అందిస్తున్నారు.
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…