చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 17వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. ముంబైని పంజాబ్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. దీంతో పంజాబ్ స్వల్ప లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలిగింది. ముంబైపై పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్‌లు మాత్రమే రాణించారు. 52 బంతులు ఆడిన రోహిత్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయగా, 27 బంతుల్లో యాదవ్ 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్‌లు చెరో 2 వికెట్లు తీశారు. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే నష్టపోయి 132 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌లు రాణించారు. 52 బంతుల్లో రాహుల్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గేల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్‌కు 1 వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…