ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 4వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ చివరి బంతి వరకు పోరాడింది. కానీ గెలుపు పంజాబ్‌ను వరించింది. రాజస్థాన్‌పై పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు రాణించారు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో రాహుల్ 91 పరుగులు చేయగా, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో హుడా 64 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ శకారియా 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సంజు శాంసన్ ఒక్కడే రాణించాడు. 63 బంతులు ఆడిన శాంసన్ 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. చివరి వరకు శాంసన్ పోరాడాడు. కానీ అతను ఔట్ అవడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. అతని సెంచరీ వృథా అయింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. జై రిచర్డ్సన్, రైలీ మెరెడిత్‌లకు చెరొక వికెట్ దక్కింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…