Photo Poses : సెల్ఫీ అయినా.. మామూలు ఫొటో అయినా.. నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫొటోలను దిగేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా డిజిటల్ కెమెరా ద్వారా దిగినా ఫొటోలు చక్కగా ఉంటేనే ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే అద్భుతమైన పోజ్‌లతో ఫొటోలు దిగవచ్చు. ఆ టిప్స్, పోజ్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిలబడి ఫుల్ లెంగ్త్‌లో ఫొటో దిగేటప్పుడు ఒక పోజ్‌ను ట్రై చేయాలి. ఏదైనా ఒక సైడ్‌కి తిరిగినట్టుగా నిలుచుని ఒక చేతిని నడుంపై వేయాలి. మరో చేతిని అలాగే వదిలేయాలి. మనం తిరిగిన సైడ్‌కి అనుగుణంగా తలను తిప్పి స్ట్రెయిట్‌గా నిలబడి చూడాలి. ఈ పోజ్‌లో ఫొటో దిగితే పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.
కెమెరా వైపు స్ట్రెయిట్‌గా నిలబడి ఉన్నప్పుడు ఏదైనా ఒక సైడ్ ఎంచుకుని ఆ వైపు చేయిని నడుంపై వేయాలి. అనంతరం అదే వైపు కాలును మోకాలి వద్ద కొద్దిగా ముందుకు వంచాలి. తలను ఈ వైపు కాకుండా మరో వైపు కొద్దిగా వంచాలి. అవతలి వైపు ఉన్న చేయి, కాలును అలాగే వదిలేయాలి. ఈ పోజ్‌లో ఫొటో దిగినా బాగా కనిపిస్తారు. ఈ టిప్ పై దాన్ని పోలి ఉంటుంది. కాకపోతే కొద్దిగా మార్పు ఉంటుంది. పై దాంట్లో కేవలం ఒక చేయిని మాత్రమే నడుంపై వేయాలని చెప్పాం కదా. కానీ ఈ పోజ్‌లో రెండు చేతులను నడుంపై వేసి మిగతాదంతా పైన చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఇలా ఈ పోజ్ కూడా చక్కని ఫొటోలను ఇస్తుంది.
ఏదైనా ఒక సైడ్‌కి తిరిగి స్ట్రెయిట్‌గా చూడాలి. అదే సమయంలో చేతులను రెండింటినీ కట్టుకోవాలి. తలను ఓ వైపుగా తిప్పాలి. ఈ భంగిమలోనూ ఫొటో బాగానే వస్తుంది. బొమ్మలోలా హాఫ్ సైజ్ స్ట్రెయిట్ ఫొటో దిగాలంటే తలను ఏదైనా ఒక వైపు వంచాలి. అనంతరం ఒక చేయిని కట్టుకున్నట్టుగా మడిచి దానిపై మరో చేయికి చెందిన మోచేయి ఆనేలా చేతిని పైకి పెట్టాలి. ఈ విధానంలో కూడా ఫొటోలను ఆకర్షణీయంగా దిగవచ్చు. ఇప్పుడు చెప్పబోయే భంగిమ కూడా పై దానిలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో ఓ చేయిని మాత్రమే ముఖం దగ్గర పైకి పెట్టాలి. మరో చేయిని నడుంపై ఉంచాలి. తలను ఒక వైపు కొంచెం తిప్పాలి. ఈ పోజ్ కూడా బాగానే ఉపయోగపడుతుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…