Closing Eyes While Kissing : ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో మానవుడు కూడా ఒక జాతికి చెందుతాడు. అయితే మనిషి తప్ప ఏ ఇతర జీవరాశి అయినా తన ప్రేమను, ఆప్యాయతను ఇతర జీవుల పట్ల ఎలా పంచుకుంటుంది..? జంతువులైతే తమ ముక్కులను ఒకదానితో ఒకటి రాసుకుని ప్రేమను కనబరుస్తాయి. అదే మనిషి విషయానికి వస్తే ఆయా ప్రాంతాల వ్యవహార శైలులకు అనుగుణంగా కొందరు ఆప్యాయంగా కావలించుకుంటారు. మరికొందరు ముద్దు పెట్టుకుని తమ అభిమానాన్ని ఇతరుల పట్ల చాటుకుంటారు. అయితే ఎవరైనా ముద్దు పెట్టుకున్నప్పుడు మీరో విషయం గమనించారా? అదేనండీ, ముద్దు పెట్టుకునే వారు కచ్చితంగా కళ్లు మూసుకునే ముద్దు పెట్టుకుంటారు. అవును, ఇది నిజమే. అయితే ఎవరైనా కళ్లు మూసుకునే ఎందుకు ముద్దు పెట్టుకుంటారు? అది తెలుసుకోవాలంటే దీన్ని చదవండి..
ముద్దు పెట్టుకోవడమనేది ఒకరికి మరొకరిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మనం సాధారణంగా ఏదైనా ఒక పనిచేస్తూ మరో పని చేయలేం. ఏదైనా కేవలం ఒక పనిపై మాత్రమే మనం శ్రద్ధ వహించగలం. సరిగ్గా ఇదే సూత్రం ముద్దుకు కూడా వర్తిస్తుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్లు తెరిచి ఉంచితే మనం దానిపై సరిగ్గా దృష్టి పెట్టలేం. దీంతో కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ముద్దు పెట్టుకునే సందర్భంలో మన కళ్లు ఆటోమేటిక్‌గా అవే మూతపడిపోతాయి. మెదడు ఆవిధంగా కళ్లను ఆపరేట్ చేస్తుంది.
ఇంకో విషయమేమింటే కళ్లు తెరిచి ముద్దు పెట్టుకుందామనుకున్నా అలా చేయలేమట. ఒక వేళ బలవంతంగా కళ్లు తెరిచి ముద్దు పెట్టుకున్నా అది రొమాంటిక్‌గా ఉండదట. ఈ క్రమంలో అసలైన ముద్దు మజాను అనుభవించాలంటే తప్పనిసరిగా కళ్లు మూయాల్సిందేనట. అందుకనే ఎవరైనా సరే ముద్దు పెట్టుకున్నప్పుడు సహజంగానే కళ్లు మూస్తారు. ఇదీ.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…