మన దేశంలో దాదాపుగా ఎక్కడికి వెళ్లినా రైళ్లు, బస్సుల్లో సీట్లు నీలి రంగులో ఉంటాయి. అవును.. ఆయా వాహనాలు బయటకు ఏ రంగు ఉన్నా సరే సీట్ల రంగు మాత్రం నీలి రంగులోనే ఉంటుంది. సీట్లకు దాదాపుగా నీలి రంగునే వేస్తారు. అయితే ఇలా ఎందుకు వేస్తారో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
బస్సులు, ట్రైన్ ల లోపల ఉండే సీట్లు నీలి రంగులో ఉంటాయి. ఇలా నీలి రంగును ఎంపిక చేసుకోవడానికి కారణం శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంది. నీలిరంగు విషయానికి వస్తే నీలిరంగు మనకు రక్షణ, రిలాక్సేషన్ ను ఇస్తుంది.
అలాగే మనం ప్రయాణించే ముందు ఎక్కువ సేపు ట్రైన్, బస్సు కోసం వేచి ఉండటం, బస్సును, ట్రైన్‌ను మిస్ అవుతావని తొందర పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివలన మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఈ క్రమంలో మనం బస్సులో లేదా ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత నీలిరంగు సీట్లను చూసి మనకు ప్రశాంతత కలుగుతుంది. అందువల్లే బస్సులు, ట్రైన్ లోపల ఉండే సీట్లు నీలిరంగులో ఉంటాయి. ఈ లాజిక్‌ను బేస్ చేసుకుని టోక్యో నగరంలో వీధి దీపాలను నీలి రంగులోకి మార్చారు. దీని కారణంగా అక్కడ క్రైమ్ రేటు కూడా చాలా తగ్గిందట. ఎందుకంటే తప్పు చేయాలనుకునే వ్యక్తుల మనస్తత్వాన్ని ఈ నీలిరంగు వీధి దీపాలు కొంతవరకు మార్చేస్తాయట. అందుకనే అక్కడ అలాంటి ఏర్పాటు చేశారు. అలాగే నీలిరంగు దీపాలు మొక్కల పెరుగుదలను కూడా వేగవంతం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అందుకనే చాలా చోట్ల నీలి రంగును వాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…