మనుషులు చనిపోయాక మళ్లీ ఇంకొకరికి పుట్టడాన్ని పునర్జన్మ అంటారు. ఇది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ.. సినిమాల్లో అయితే మనం చాలా చూశాం. ఒకరికి పుట్టిన వారు చనిపోయి పునర్జన్మించి ఇంకొకరికి పుడుతుంటారు. తరువాత వారికి గత జన్మ తాలూకు విషయాలు గుర్తుకు వస్తాయి. ఈ విధంగా సినిమాల్లోనే జరుగుతుంటుంది. వాస్తవ జీవితంలో అసలు జరగదు. కానీ ఇప్పుడు చెప్పే సంఘటన గురించి తెలిస్తే నిజంగా అలా జరుగుతుందని మీరు కూడా నమ్ముతారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నాగ్లా సలేహి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు రోహిత్ కుమార్ మే 4, 2013న చనిపోయాడు. సమీపంలో ఉన్న కెనాల్‌లో స్నానానికి వెళ్లి అందులో మునిగి మృతి చెందాడు.
అయితే ఆ గ్రామానికి సమీపంలో ఉన్న రామ్ నరేష్ శంఖ్‌వార్ అనే వ్యక్తి కుమారుడు చంద్రవీర్ అలియాస్ ఛోటు ఇటీవల ప్రమోద్ కుమార్ ఇంటికి వచ్చి తాను గత జన్మలో రోహిత్ కుమార్ అని చెప్పాడు. అంతేకాదు, రోహిత్ కుటుంబ సభ్యులందరినీ గుర్తు పట్టాడు. ఈ క్రమంలో అతన్ని రోహిత్ చదివిన స్కూల్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ ఛోటు అందరినీ గుర్తు పట్టాడు. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రామ్ నరేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తన కుమారుడు ఛోటు ఎప్పుడూ గత జన్మ గురించి చెప్పేవాడని, కానీ అతను తమ నుంచి దూరం అవుతాడని భయం వేసి అతన్ని నాగ్లా సలేహి గ్రామానికి పంపించేవాళ్లం కాదని, కానీ ఇప్పుడు రాక తప్పలేదని తెలిపాడు. ఏది ఏమైనా ఒకప్పుడు చనిపోయాడనుకున్న బాలుడు ఇప్పుడు మళ్లీ వచ్చి తాను పునర్జన్మించానని చెబుతుండడం, అందరినీ గుర్తు పడుతుండడం నిజంగానే అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…