Yash : అంతర్జాతీయంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎంత పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ను ఇండియాలో కూడా ప్రచురిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఫైనాన్స్, పరిశ్రమలు, పెట్టుబడులు, మార్కెటింగ్ వంటి అంశాల్లో రాణిస్తున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ధనికుల గురించి ఎక్కువగా కథనాలను ప్రచురిస్తుంటారు.
అయితే ఈసారి ఫోర్బ్స్ యాజమాన్యం సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించింది. అందులోనూ ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో ఎంతో పేరు తెచ్చుకున్న పలువురుల నటీనటుల ఫోటోలను కవర్ పేజీలుగా అచ్చు వేసింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఫొటోను మొదటి కవర్ పేజీగా ఫోర్బ్స్ అచ్చు వేసింది.
ఇక మరో దక్షిణాది నటుడు దుల్కర్ సల్మాన్ ఫొటోను రెండో కవర్ ఆర్టికల్ ఫొటోకు అచ్చు వేసింది. ఇక మూడో కవర్ పేజీకి యష్ ఫొటోను అచ్చు వేశారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి కన్నడ యాక్టర్‌గా యష్ రికార్డు సృష్టించారు. ఆ కథనంలో యష్‌కు చెందిన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చదవచ్చు.
ఇక యష్ హీరోగా రూపొందుతున్న కేజీఎఫ్: చాప్టర్ 2 వచ్చే ఏడాది.. అంటే 2022లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…