గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Akhanda Movie : అఖండ మూవీ చూస్తూ.. బాల‌య్య అభిమాని, ఎగ్జిబిట‌ర్ మృతి..

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌రో చిత్రం అఖండ‌.. బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. కోవిడ్ రెండో ద‌శ త‌రువాత థియేట‌ర్లు తెరుచుకోగా.. అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో…

Akhanda Movie : అఖండ మూవీ చూస్తూ.. బాల‌య్య అభిమాని, ఎగ్జిబిట‌ర్ మృతి..

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌రో చిత్రం అఖండ‌.. బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. కోవిడ్ రెండో ద‌శ త‌రువాత థియేట‌ర్లు తెరుచుకోగా.. అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ఇక అఖండ మూవీ కూడా రికార్డుల‌ను కొల్ల‌గొట్టే దిశ‌గా మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తూ దూసుకుపోతోంది.

అయితే అఖండ సినిమాను చూస్తూ బాలకృష్ణ అభిమాని, ఎగ్జిబిట‌ర్ అయిన జాస్తి రామకృష్ణ (49) మృతి చెందారు. రాజమండ్రిలో సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ (49) మృతి చెందారు. శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే మార్గ‌మ‌ధ్య‌లోనే ఆయ‌న చ‌నిపోయారు. ఈ క్ర‌మంలో ఆయన మృతికి కార‌ణాలు ఏమై ఉంటాయోన‌ని వైద్యులు ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

while watching Akhanda Movie one exhibitor and balakrishna fan died

ఇక అఖండ మూవీకి థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌గా.. కొన్ని థియేట‌ర్ల‌లో థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు సౌండ్ బాక్స్‌ల నుంచి పొగ‌లు వ‌స్తున్నాయ‌ని.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలాకాలం త‌రువాత బాల‌య్య‌కు మ‌ళ్లీ అఖండ రూపంలో మంచి హిట్ వ‌చ్చింది. కానీ ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌క్కువ‌గా ఉండ‌డం, అద‌న‌పు షోల‌కు అనుమ‌తి లేక‌పోవ‌డంతో.. ఆ ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప‌డుతుంద‌ని అంటున్నారు. ఒక‌వారం ఆగితేనే గానీ అస‌లు విష‌యం తెలియ‌ద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి