గురువారం, జూన్ 11, 2026
క్రైమ్‌

విషాదం: సరదాగా ఈతకు వెళ్లారు.. మడుగులో గల్లంతై పోయారు!

కొన్నిసార్లు ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందరితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఒక్కసారిగా మడుగులో గల్లంతయ్యే పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గాలివీడు మండలం…

విషాదం: సరదాగా ఈతకు వెళ్లారు.. మడుగులో గల్లంతై పోయారు!

కొన్నిసార్లు ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందరితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకులు ఒక్కసారిగా మడుగులో గల్లంతయ్యే పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో నలుగురు గల్లంతయ్యారు. ఆ నలుగురు బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

విహార యాత్రల కోసం బెంగళూరు నుంచి 10 మంది చిత్తూరులోనే వాల్మీకిపురం అని గ్రామంలోని తన బంధువుల ఇంటికి చేరుకున్నారు. అక్కడ మరో పది మందితో కలిసి వీరందరూ సరదాగా వెలిగల్లు ప్రాజెక్టుకి వెళ్లారు. ప్రాజెక్టు వద్ద అందరూ కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే అందరూ ఆడుకుంటూ దిగువన ఉన్న గండి మడుగులోకి సరదాగా ఈతకు వెళ్లారు.

అందరూ కలిసి ఎంతో సరదాగా ఈత కొడుతున్న సమయంలో వారిలో నలుగురు సభ్యులు మడుగులో గల్లంతైపోయారు. గల్లంతయిన వారు మహ్మద్‌ హఫీజ్‌(10), ఉస్మాన్ ఖానమ్‌(12), తాజ్ మహమద్(40), మహ్మద్‌ హంజా(12) గా గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్‌ సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి