Viral Video : లంచం కోసం కొందరు ఏం చేయడానికైనా వెనుకాడరు. లంచం ఇస్తే ఏ పనైనా చేస్తారు. అయితే అక్కడ జరిగింది వేరే. రోగులు ఇచ్చిన రూ.500 లంచం కోసం ఇద్దరు సిబ్బంది సిగలు పట్టుకుని మరీ తన్నుకున్నారు. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని లక్ష్మీపూర్ బ్లాక్ ఏరియాలో ఉన్న జముయ్‌లో ఓ మహిళకు శిశువు జన్మించింది. అయితే ఆ శిశువుకు బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అక్కడే ఉన్న ఆశ వర్కర్ రింతు కుమారి ఆ శిశువును ఏఎన్ఎం వద్దకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ శిశువుకు చెందిన వారు ఇచ్చిన రూ.500 లంచాన్ని పంచుకునేందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఆశ వర్కర్ రింతు కుమారి, ఏఎన్ఎం ఇద్దరూ రూ.500 లంచం కోసం గొడవపడ్డారు. నాకంటే నాకని ఇద్దరూ గొడవపడగా.. అది పతాక స్థాయికి చేరుకుంది. చివరకు ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని తన్నుకున్నారు. ఆ తరువాత కొందరు వారిని విడదీశారు. దీంతో గొడవ సద్దు మణిగింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సంఘటనపై ఆ హాస్పిటల్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…