గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Vijay Devarakonda : పవన్‌ కల్యాణ్‌ అంతటి క్రేజ్‌ విజయ్‌ దేవరకొండకు వస్తుంది..!

Vijay Devarakonda : సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ,అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాణ రంగంలో ఎంతో…

Vijay Devarakonda : పవన్‌ కల్యాణ్‌ అంతటి క్రేజ్‌ విజయ్‌ దేవరకొండకు వస్తుంది..!

Vijay Devarakonda : సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ,అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాణ రంగంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఇంటి నుంచి మొట్టమొదటిసారిగా హీరోగా ఆశిష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Vijay Devarakonda will get craze like pawan kalyan says dil raju

ఈ క్రమంలోనే ఆశిష్, అనుపమ జంటగా రౌడీ బాయ్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కాలేజీ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ టైటిల్ పెట్టడానికి విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం దిల్ రాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి టైటిల్, టీజర్, పాటలను విడుదల చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా ప్రేమే ఆకాశం అనే పాటను విడుదల చేయడానికి ఒక ఈవెంట్ ఏర్పాటుచేసిన దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండను ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయడమే కాకుండా విజయ్ దేవరకొండ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ నాలుగవ సినిమాకే పవన్ కళ్యాణ్ అంత క్రేజ్ సంపాదించుకున్నారని, పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి స్టార్ హీరోగా ఫ్యూచర్ లో విజయ్ దేవరకొండ మంచి పేరును సంపాదించుకుంటాడని ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి