గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nayanthara : గ్రాండ్‌గా నయనతార బర్త్‌ డే నిర్వహించిన ప్రియుడు.. సమంత కూడా హాజరైంది..!

Nayanthara : తమిళ డైరెక్టర్ విఘ్నేవ్‌ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతారతో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (నవంబర్ 18) తన ప్రేయసి నయనతార పుట్టినరోజు కావడంతో బుధవారం రాత్రి…

Nayanthara : గ్రాండ్‌గా నయనతార బర్త్‌ డే నిర్వహించిన ప్రియుడు.. సమంత కూడా హాజరైంది..!

Nayanthara : తమిళ డైరెక్టర్ విఘ్నేవ్‌ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతారతో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు (నవంబర్ 18) తన ప్రేయసి నయనతార పుట్టినరోజు కావడంతో బుధవారం రాత్రి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేసి తన ప్రేయసికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

vignesh shivan celebrated his fiancé Nayanthara birth day celebrations

ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు వేడుకలకు తెలుగు సినీ నటి సమంత హాజరయ్యారు. ప్రస్తుతం ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CWY5C2_BfH-/?utm_source=ig_embed&ig_rid=ca63dcc1-6148-40fe-8f21-5dfc49a20e16

విఘ్నేశ్‌ శివన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కణ్మణి, తంగమేయి నా ఎల్లమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం పరిపూర్ణం అయింది, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.. అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రలలో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలోనే నయనతార పుట్టినరోజు వేడుకలలో సమంత సందడి చేసింది. ఇక ఈమె కేక్ కటింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతోమంది అభిమానులు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి