Venu Swamy : విజయ్ దేవరకొండ విషయంలో జరగబోయేది ఇదే..! వేణు స్వామి చెప్పిన భయంకరమైన నిజం ఏమిటంటే..?

August 26, 2022 2:06 PM

Venu Swamy : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా లైగర్ చిత్రం పేరు మార్మోగిపోతోంది. రెండున్న‌రేళ్ల నుంచి ఊరిస్తూ వ‌చ్చిన లైగ‌ర్ చిత్రం ఈ ఆగష్టు 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రౌడీ హీరో విజ‌య్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్  కాంబినేష‌న్‌ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్‌పాండే, రోనిత్ రాయ్, ఆలీ, గెటప్ శ్రీను వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ‌స్ట్ షో నుంచే ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ ను అందుకుంది. సినిమా అసలు ఏమాత్రం బాగోలేదు అంటూ ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్‌ మినహా చిత్రం వారంలోపే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కెరీర్‌లో అత్యంత‌ చెత్త సినిమా ఇదే అంటూ విమర్శలు వెలువడుతున్నాయి.

Venu Swamy told sensational things about Vijay Devarakonda
Venu Swamy

ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. గతంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి సినిమా ప్రముఖుల జాతక విశేషాలు చెప్పే ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజం అవుతుందా అనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విజ‌య్ జాత‌కంలో అష్ట‌మ‌ద‌శ శ‌ని నడుస్తుంది అంటూ, విజ‌య్ దేవరకొండ మ‌రో ఉద‌య్ కిర‌ణ్ అవుతాడు అంటూ వార్త ప్రచారం అవుతోంది.

గతంలో సక్సెస్ ను సొంతం చేసుకొని స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కునాల్, అబ్బాస్, ఉదయ్ కిరణ్ లాంటి వారు మంచి స్టార్ డమ్ ని అందుకొని ఒకేసారి ఎలా డీలా పడిపోయారో విజయ్ దేవరకొండ సైతం అష్టమశని ప్రభావంతో ఆ హీరోల‌ మాదిరిగానే విజయాల బాట నుంచి అపజయాల బాటలోకి వెళతాడు అంటూ వేణు స్వామి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. గతంలో వేణు స్వామి చెప్పిన ఈ మాటలే ఇప్పుడు వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now