Samantha : నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తీవ్రంగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆమె పోస్టులను చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే కొంత కాలానికి షరా మూమూలే అన్నట్లుగా అంతా సద్దుమణుగుతుంది. కానీ సమంత విడాకుల విషయానికి మాత్రం ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడుస్తోంది.
ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతదే తప్పు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వీరి విడాకుల టాపిక్ ఇప్పటికీ సెన్సేషనల్‌గానే మారింది. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వీరి విడాకులపై తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అయితే సమంతకు చెందిన తాజా వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
సమంత, నాగచైతన్యల విడాకుల విషయం నేపథ్యంలో వారికి ప్రస్తుతం వస్తున్న క్రేజ్ దృష్ట్యా టీఆర్‌పీ రేటింగ్‌ను పెంచుకునేందుకు ఓ టాప్ తెలుగు చానల్ సమంతతో ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేసిందట. అయితే ఓ మధ్యవర్తి ద్వారా రాయబారం కూడా నడిపారట. కానీ ఆ వ్యక్తి ద్వారా ఆ చానల్ పంపిన ఆ ఆఫర్‌ను సమంత తిరస్కరించిందట.
ప్రస్తుతం సమంత, నాగచైతన్యల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తమ చానల్‌కు టీఆర్‌పీ రేటింగ్ ను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ చానల్ వారు సమంతతో ఇంటర్వ్యూకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ సమంత ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో ఆ చానల్ వారు ఉసూరుమన్నారట.
టీఆర్‌పీ రేటింగ్స్ కోసం టీవీ చానల్స్ వారు ఏమైనా చేస్తారు. సమంతతో ఇంటర్వ్యూ తీసుకుని దాన్ని ట్రెండింగ్ చేద్దామని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. మరి ఆమె ఇక ముందు అయినా ఇంటర్వ్యూలు ఇస్తుందా, లేదా.. అన్నది చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…