Tollywood : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూశారు. ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితంగా ఉంటూ పలు సినిమాలు కూడా నిర్మించిన మహేష్ ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి ప్రతి ఒక్కరికీ షాకింగ్‌గా మారింది.
118, తిమ్మరసు, మిస్ ఇండియా వంటి చిత్రాలను కూడా నిర్మించారు మహేష్. ఆయన ఇలా హఠాన్మరణం చెందడం పట్ల చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. మహేష్ మృతితో ఎన్టీఆర్ కూడా షాకయ్యారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా, నా మిత్రుడు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహేష్ కోనేరు ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై విశ్లేషణ చేస్తూ వీడియో విడుదల చేశారు. పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది సాయిధరమ్ తేజ్‌కు జరిగిన ప్రమాదంపై మిడి మిడి జ్ఞానంతో కామెంట్స్ చేస్తున్నారు. అతను అతి వేగంగా, బాధ్యతా రాహిత్యంతో డ్రైవింగ్ చేసే వ్యక్తి కాడు. రోడ్డుపై మట్టి, ఇసుక ఉండడం వల్ల ముందు వెళుతున్న వాహనాలు స్లో అయ్యాయి. సాయి నెమ్మదించి పక్కనుంచి వెళ్లాలనుకున్నాడు. అయితే అక్కడ ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు.. అని స్పష్టం చేశాడు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…