Tollywood : సినిమాల్లో అవ‌కాశాల కోసం గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్న యాంక‌ర్‌.. ఇంట్లో వారు చెప్పినా విన‌డం లేద‌ట ?

October 22, 2021 1:13 PM

Tollywood : సినిమా రంగంలో ఒక్క‌సారి పేరు వ‌స్తే చాలు. అవ‌కాశాలు వాటంత‌ట అవే వెదుక్కుంటూ వ‌స్తాయి. కానీ ఒక్క‌సారి ఒక్క చాన్స్ దొరికి ఒక సినిమాలో న‌టించే అవ‌కాశం మాత్రం ల‌భించాలి. అందులో క్లిక్ అయితే ఇక వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సి ప‌నిలేదు. అయితే ఆ ఒక్క చాన్స్ కోస‌మే ప‌రిత‌పించే వారు, తీవ్రంగా క‌ష్ట‌ప‌డే వారు ఎంతో మంది ఉంటారు. ఇక కొంద‌రు న‌టీమ‌ణులు అయితే ఆ ఒక్క చాన్స్ కోసం ఎంత గ్లామ‌ర్‌గా న‌టించేందుకు అయినా స‌రే.. రెడీ అంటుంటారు.

Tollywood one anchor doing glamorous shoots for film chances

సామాజిక మాధ్య‌మాల ప్ర‌భావం ఎక్కువైన నేప‌థ్యంలో ఆ ప్లాట్‌ఫాంపై గ్లామ‌ర్‌ను ఏ విధంగా ఒల‌క‌బోసినా చాలు.. ఏదో ఒక చాన్స్ రాక‌పోతుందా..? అని చాలా మంది న‌టీమ‌ణులు ఎదురు చూస్తుంటారు. అందుక‌నే మ‌న‌కు ఏ సోష‌ల్ ప్లాట్‌ఫాం ఓపెన్ చేసినా చాలు.. ఆయా న‌టీమ‌ణుల‌కు చెందిన గ్లామ‌ర్ ఫొటోలు, వీడియోలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. అయితే ఇలాగే ఓ యాంక‌ర్ ఇటీవ‌లి కాలంలో త‌మ గ్లామ‌ర్ డోస్‌ను పెంచేసింది.

సినిమా రంగంలో అవ‌కాశాల కోస‌మే ఆమె ఆవిధంగా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆమె గ్లామ‌ర్ షోపై ఇంట్లోని కుటుంబ స‌భ్యులే హెచ్చ‌రించార‌ట‌. ఆ విధంగా చేయ‌డం వ‌ల్ల ప‌రువు పోతుంద‌ని భావిస్తున్న ఆ కుటుంబం ఆమెకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆమె విన‌డం లేద‌ట‌. దీంతో ఆ యాంక‌ర్ త‌న దారిలో తాను వెళ్లాలని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూసేవారికి ఇంట్లో కుటుంబ స‌భ్యుల స‌పోర్ట్ ఉంటే చాలా త్వ‌ర‌గా వారు ఆ రంగంలో రాణించేందుకు అవ‌కాశాలు ఉంటాయి. లేదంటే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు వ‌స్తాయి. మ‌రి ఆ యాంక‌ర్ ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now