Toll Charges : సాధారణంగా మనం రహదారులపై ప్రయాణించేటప్పుడు మధ్య మధ్యలో టోల్ గేట్స్ వస్తుంటాయి. ఇవి అన్ని రహదారులపై కనిపించవు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ రహదారులపై మాత్రమే మనకు టోల్ గేట్స్ కనిపిస్తుంటాయి. అయితే టోల్ గేట్స్ గుండా ప్రయాణించినప్పుడు టూవీలర్స్‌ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహనాలకు టోల్ వసూలు చేస్తుంటారు. మరి టూవీలర్స్‌కు టోల్ చార్జిల నుంచి ఎందుకు మినహాయింపును ఇచ్చారో తెలుసా ? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్లు, వ్యాన్లు, డీసీఎంలు, ట్రక్కులు, లారీలు, బస్సులు, భారీ వాహనాలతో పోలిస్తే.. టూవీలర్లు బరువు తక్కువ. టూవీలర్లు రోడ్డు మీద ప్రయాణించినప్పుడు అయ్యే డ్యామేజ్ కూడా తక్కువే. కనుకనే టూవీలర్స్‌కు టోల్ వసూలు చేయరు.
ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది. సాధారణంగా కార్లు, ఆపైన ఉండే భారీ వాహనాలు మాత్రమే రోజూ వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. టూవీలర్ మీద రోజూ ఎవరూ 100 కిలోమీటర్లు వెళ్లరు. ఎప్పుడో లాంగ్ డ్రైవ్ చేస్తే తప్ప. అంటే.. టూవీలర్లు రోడ్డును తక్కువగా ఉపయోగించుకుంటాయి. కనుక వాటికి టోల్ చార్జిలను వసూలు చేయరు.
ఇక మన దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు ఎక్కువగా టూవీలర్స్ వాడుతుంటారు. అలాంటి వారి నుంచి ట్రిప్‌కు రూ.30-రూ.50 మేర టోల్ చార్జిలను వసూలు చేయడం సరికాదన్నది ప్రభుత్వం భావన. అందుకే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టూవీలర్ల నుంచి టోల్ చార్జిలను వసూలు చేయడం లేదు. ఇదీ.. అసలు విషయం..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…