Thalambrala Chettu : గ్రామాల్లో, రోడ్డుకు ఇరు ప్రక్కలా, చెరువు గట్ల మీద ఎక్కువగా కనిపించే చెట్లల్లో తలంబ్రాల చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టును అత్తాకోడళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు మనకు విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టు పొదలుగా పెరుగుతుంది. వీటిలో దాదాపుగా 150 జాతులు ఉన్నాయి. ఈ చెట్టు పూలు గుత్తులు గుత్తులుగా వివిధ రంగుల్లో పూస్తాయి. తలంబ్రాల చెట్టు పూలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఈ చెట్టును వివిధ రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
తలంబ్రాల చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి, ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్క ఆకులను చికెన్ పాక్స్, కుష్టు, ఆస్తమా వంటి వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రో బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. విష కీటకాలు కుట్టినప్పుడు ఈ ఆకుల రసాన్ని కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.
తలంబ్రాల చెట్టు ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మొక్క ఆకులను మరిగించిన నీటితో ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తలంబ్రాల చెట్టు ఆకులను ఎండబెట్టి ఆ ఆకులతో ఇంట్లో పొగ వేయడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.
ఈ చెట్టును ప్రకృతి వ్యవసాయంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకుల కషాయాన్ని క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో బుట్టల అల్లకంలో కూడా ఈ చెట్టును ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా తలంబ్రాల మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించడం వల్ల మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…