Tejaswini : బాల‌య్య రెండో కుమార్తె తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

October 3, 2022 10:29 AM

Tejaswini : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే. ఆయ‌న సినిమాల‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్లు వేరే. మాస్‌ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌. సినిమాల ప‌రంగా చూసుకుంటే ఆయ‌న అగ్ర హీరోగా ఉన్నాడు. ఇంత పెద్ద హీరో అయినా, ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌ది పెద్ద ఫ్యామిలీ అయినా.. త‌న కుటుంబాన్ని మీడియాకు వీలైనంత దూరంగానే ఉంచుతాడు బాలయ్య. ఆయ‌న కుటుంబ విష‌యాల‌ను పెద్ద‌గా బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌డు. చాలామందికి ఆయ‌న పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి మాత్ర‌మే తెలుసు.

నారా లోకేష్ ని వివాహం చేసుకొని, హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటుందని.. కానీ ఆయ‌న చిన్న కూతురు తేజ‌స్విని గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. వాస్త‌వానికి బాల‌య్య భ‌య‌ప‌డే ఒకే ఒక్క వ్య‌క్తి కూడా ఈమెనే. ఆమె ఏం చెప్తే అది వింటాడ‌ట‌ బాల‌య్య. ప్ర‌స్తుతం బాల‌య్య సినిమాల‌కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటుంది ఈవిడే. ఇది వ‌ర‌కు బాల‌య్య సినిమా డేట్స్, ఇత‌ర ప్రోగ్రాంలు డాక్ట‌ర్ సురేంద‌ర్ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తేజ‌స్విని చూసుకుంటుంది. అంతే కాకుండా బాల‌య్య ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా తేజ‌స్వినినే నిర్ణ‌యిస్తుందట.

Tejaswini Balakrishna second daughter what is she doing now
Tejaswini

ఇదివ‌ర‌కుకూ బాల‌య్య‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి ఆయ‌న స‌తీమ‌ణి చూసుకునేవారు కానీ ఇప్ప‌డు తేజ‌శ్వినే చూసుకుంటుంది. ఇక తేజ‌స్విని గీతం యూనివ‌ర్సిటీ య‌జ‌మాని మూర్తి మ‌న‌వ‌డు శ్రీభ‌ర‌త్ ను వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం ఫ్యామిలీతోపాటు బాల‌య్య సినిమా వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటూ హైద‌రాబాద్ లోనే ఉంటుంది. త్వ‌ర‌లోనే ఆమె సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడ‌తారనే టాక్ న‌డుస్తోంది. చూడాలి మ‌రి ఏం జరుగుతుందో.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment