Red Rice : బియ్యం అనగానే మనకు ముందుగా వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఈ రెండే గుర్తుకువస్తాయి. ఈ మధ్యకాలంలో వైట్ రైస్, బ్రౌన్ రైస్ తో పాటు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ను తినడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. రెడ్ రైస్ లో ఆంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్ పుష్కలంగా ఉండటం వలన ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. రెడ్ రైస్ ను నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ బియ్యంలో పీచు, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెడ్ రైస్ ఎంతో మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ బియ్యంలో ఫైబర్ అధికంగా ఉండటం వలన త్వరగా ఆకలి వేయదు. విటమిన్ బి1, బి12, ఐరన్, జింక్, పొటాషియం, కాల్షియం, సోడియం, మాంగనీస్ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. దీంతో ఎర్రబియ్యం రెగ్యులర్ గా తిన్నవారికి కొండలాంటి బాన పొట్టను కూడా కరిగిస్తుంది.
ఈ రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఎముకలు పుష్టిగా, దృఢంగా తయారవుతాయి. ఎర్రబియ్యం షుగర్ పేషేంట్స్ కి, గుండె వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తెల్ల బియ్యం తినే కన్నా రెడ్ రైస్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెరగనివ్వదు. ఈ రెడ్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరం ఆక్సిజన్ ని ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు రెడ్ రైస్ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…