Cucumber : కీర‌దోస‌ను లైట్ తీసుకోకండి.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

September 26, 2022 1:53 PM

Cucumber : కొన్ని ఆహార పదార్థాల‌ను తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. అలా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే వాటిల్లో కీరదోస ఒకటి. కీర దోస అనేక పోషకాలను కలిగి ఉంటుంది. రోజూ కీర దోసకాయల‌ను తినడం వల్ల ఎన్నో రకాల జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే కీర దోసను ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు. మరి కొందరు వీటిని స్నాక్స్ లా నిత్యం ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కీరదోస ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కీరదోస కాయ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేష‌న్‌ సమస్య తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరంలో పేరుకున్న వ్యర్థాల‌ను తొలగించడంలో కూడా ఎంతగానో సహకరిస్తుంది. సాధ్యమైనంత వరకు దోసకాయను చెక్కు తీయకుండా తినటం మంచిది. ఎందుకంటే కీరదోస చెక్కులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కీరదోసకాయను చెక్కు తీసుకోకుండా తినటం వలన ఒక రోజులో శరీరానికి అవసరమైన 10 శాతం విటమిన్ సి అందుతుంది.

take one Cucumber daily for these benefits
Cucumber

నీటి శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో బరువు తగ్గాలని అనుకునే వారికి కీరదోసకాయ ఆహారంగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. కీరదోసలో పీచు కూడా అధికంగా ఉంటుంది. మలబద్దకంతో బాధ పడేవారు రోజూ కీరదోసను తీసుకోవటం ద్వారా మలబద్దకం సమస్య చాలా సులువుగా అదుపులోకి వస్తుంది. కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు ప‌ర‌చ‌డంలో ఎంతగానో సహకరిస్తుంది.

కీరదోసలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి పీచు ఎక్కువగా ఉండటం వలన రక్తపోటులో హెచ్చుతగ్గులను అదుపులో ఉంచుతుంది. కీరదోసలో విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, ఫోలేట్‌, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారు నిత్యం కీరదోసకాయను క్యారెట్ తో కలిపి జ్యూస్ చేసుకోని తాగడం వలన ఎముకలకు బలాన్ని కలిగించి కీళ్ళ నొప్పుల సమస్యను దూరం చేస్తుంది. క‌నుక కీర‌దోస‌న రోజూ త‌ప్ప‌నిస‌రిగా తినాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment